తనకు థర్డ్ ఫ్రంట్ ఆలోచనేదీ లేదనీ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ సోమవారం చెన్నైకు వచ్చి స్టాలిన్‍తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడలేదు. దీంతో మీడియాలో పలు రకాలై కథనాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో స్టాలిన్ మంగళవారం స్పందించారు. థర్డ్ ఫ్రంట్ ఆలోచనేదీ లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతు లేకుండా ఏ ఒక్క పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. అందువల్ల ఎలాంటి చర్చ అయినా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే జరుగుతుందన్నారు.