Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాల‌య్య ఓడిపోవ‌డం ఖాయమా... అందుకే ఆ నిర్ణ‌యమా?

Advertiesment
బాల‌య్య ఓడిపోవ‌డం ఖాయమా... అందుకే ఆ నిర్ణ‌యమా?
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (15:55 IST)
నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే... ఈ నియోజ‌క‌వ‌ర్గానికి బాల‌య్య ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ చేసింది ఏమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయ‌న భార్య పీఎ ద్వారా ప‌రిపాల‌న చేసార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికితోడు బాల‌య్య ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల పైనే దాడి చేయ‌డంతో పార్టీ నాయ‌కులే షాక్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తో బాల‌య్య ఓడిపోవ‌డం ఖాయం అని గ‌ట్టిగా వినిపిస్తోంది.
 
ఈ వార్తలు అలా అలా బాల‌య్య‌ చెవికి కూడా చేరాయట‌. అందుకే త‌ను ఓడిపోతున్నాను అని ముందుగానే ప్రీపేర్ అవుతున్నాడ‌ట‌. ఇక నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా... సినిమాయే జీవితంగా బ‌త‌కాల‌నుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. 
 
కెఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత బోయ‌పాటి శ్రీనుతో సినిమా ఉంటుంది. ఈ మూవీ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండేళ్ల క్రితం నా జీవితం, ఇండియన్ సినిమాను మార్చేసింది...