Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ కంటే అలీకి ఆయనంటే చాలా ఇష్టం.. ఎవరది?

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (14:09 IST)
ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు అలీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న 'క్యాష్' లేటెస్ట్ ఎపిసోడ్‌లో హాస్యనటుడు అలీ, నటుడు పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీని సుమ కొన్ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగింది. 
 
మొదట ఈ ఇద్దరిలో మీకెవరు ఇష్టం? అని రెండు ఆప్షన్స్ ఇచ్చింది. అందులో ఒకటి రాఘవేంద్రరావు పేరు కాగా.. మరొకటి పవన్ కల్యాణ్ పేరు. అలీ పవన్ కల్యాణ్ పేరు చెబుతాడని చాలామంది అనుకున్నారు. కానీ అలీ మాత్రం రాఘవేంద్రరావే ఇష్టమన్నారు. 
 
పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరన్న సంగతి తెలిసిందే. చాలా సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ హిట్ అయింది. కానీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అలీ వైసీపీలో చేరడంతో వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి అదే గ్యాప్ కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అలీ పవన్ కల్యాణ్ పేరును పట్టించుకోకుండా రాఘవేంద్రరావు పేరు చెప్పాడనుకోవచ్చు.
 
ఇక ఇదే రాపిడ్ ఫైర్‌లో భాగంగా పూరి జగన్నాథ్, రవితేజల్లో ఎవరంటే ఇష్టమని ప్రశ్నించగా.. రవితేజ అని చెప్పాడు అలీ. ఇక చివరలో చిరంజీవి గురించి అడిగిన ఓ ప్రశ్నను మాత్రం పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో పెట్టేశారు. అదేంటో తెలియాలంటే షో చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments