Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రష్మీ గౌతమ్ మోదీ భజన... సుడిగాలి సుధీర్ నా అర్థమొగుడు..

రష్మీ గౌతమ్ మోదీ భజన... సుడిగాలి సుధీర్ నా అర్థమొగుడు..
, సోమవారం, 25 నవంబరు 2019 (10:22 IST)
యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భజన చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే రష్మీ గౌతమ్.. మోదీ ప్రభుత్వం 2015లో మిలటరీలో పనిచేసిన మూగ జీవాలైన కుక్కల్నీ ఆ తర్వాత అన్ ఫిట్ పేరుతో చంపకుండా ఓ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

దానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను రష్మీ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఇక ఇప్పటినుండి మోదీ భక్తురాలినని.. మోదీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది.
 
మరోవైపు సుడిగాలి సుధీర్‌పై తనకున్న ప్రేమాయణం గురించి వివరించింది. తాజాగా.. ఢీ ఛాంపియన్స్‌లో టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్న వీళ్లు మళ్లీ ప్రేమ పుస్తకాన్ని తెరిచారు. దానిలో సుధీర్ లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించడం.. అతడ్ని రష్మీ బకరా చేయడం మళ్లీ కామన్ అయిపోయింది. అయితే.. ఆశ్చర్యకరంగా రష్మీ చేసిన ఒక వ్యాఖ్య మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
 
అదేంటంటే.. రష్మీ దగ్గరికి సుడిగాలి సుధీర్ వెళ్లగానే యాంకర్ రవి వచ్చి సుధీర్ ఎవరు అని అడగ్గా.. నా అర్ధమొగుడు అని చెప్పడంతో షోలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. షో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆ మాటకు బిత్తరపోయారు.

ఈ మాట రష్మీ అనగానే సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు, ఫోటోలతో హోరెత్తించారు. వాళ్లు బుల్లితెరపై చేసుకున్న పెళ్లికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొందరైతే త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్లతో విజ్ఞప్తి చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20 మిలియ‌న్ రియ‌ల్‌టైమ్ వ్యూస్‌తో రికార్డ్ సాధించిన మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌