Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నలుపు పసుపు నూరి ముఖానికి రాసుకుంటే.. భార్యాభర్తల మధ్య? (video)

Advertiesment
Black Turmeric
, మంగళవారం, 26 నవంబరు 2019 (16:45 IST)
సాధారణంగా పసుపు కొమ్ములు పసుపు రంగంలో వుంటాయి. అయితే నలుపు రంగులో వుండే పసుపు గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. నలుపు రంగులో వుండే పసుపు కొమ్ములు కాళికాదేవి అవతారమని చెప్తుంటారు. ఈ పసుపును కాళీకాదేవికి, కాల భైరవునికి ఉపాసన కోసం వుపయోగిస్తారు. 
 
పసుపు రంగు పసుపు ఇంటి ముందు కడితే.. చేతబడులు పనిచేయవు. వ్యతిరేక శక్తులుండవు. ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. కోర్టు సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. నలుపు రంగు పసుపు కొమ్మును బాగా నూరి రోజూ తిలకంలా నుదుటిపై వుంచితే ధనాదాయం వుంటుంది. ఇంకా శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు వుండవు. రాహు దోషాలను కూడా ఇది తొలగిస్తుంది.
 
ధనం కోసం బయటికి వెళ్ళేటప్పుడు లేదా వ్యాపారం చేసే ప్రాంతంలో నలుపు పసుపు కొమ్ములను వుంచడం ద్వారా మంచి ధనరాబడి వుంటుంది. బీరువాల్లో డబ్బు వుంటే డబ్బాల్లో నలుపు రంగుతో కూడిన పసుపు కొమ్మును వుంచితే ధనాదాయం వుంటుంది. 
 
అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడితే.. నలుపు పసుపు కొమ్మును నూరి ముఖానికి రాసుకుని స్నానం చేసినట్లైతే.. భార్యాభర్తల మధ్య దాంపత్య సౌఖ్యం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఏమిటో తెలుసా?