చెవుల్లో బడ్స్ వాడుతున్నారా.. అయితే భవిష్యత్తులో చెవుడు ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెవుల్లో వుండే వ్యర్థాన్ని తొలగింతుకునే నిర్మాణం స్వతహాగా చెవుల్లోనే వుంటుందట. మనం ప్రత్యేకంగా వ్యర్థాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనంలో తేలింది. చెవులు సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు తేల్చేశారు.
అలా కాకుండా ఇయర్ బడ్స్ ద్వారా క్లీన్ చేయాలని ప్రయత్నిస్తే లోపల వుండే గులిమి కొంత మాత్రమే బయటికి వస్తుందట. మిగిలినది ఇయర్ బడ్స్ తాకిడికి మరింత లోపలికి వెళ్లి ఇయర్ కెనాల్ నుంచి ప్రయాణించే కర్ణభేరిపై పడుతుందని పరిశోధకులు తెలిపారు. చెవిలోపలికి ప్రవేశించే ధ్వని తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించి.. వాటిని మెదడుకు చేరవేయడం కర్ణభేరి విధి.
అయితే అలా ఎక్కువ సంఖ్యలో గులిమి కర్ణభేరిపై పేరుకుపోతే.. సున్నితమైన కర్ణభేరి తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించే సామర్థ్యం కోల్పోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కంపిస్తున్న వస్తువుపై భారం పడితే.. అది కంపనాలను ఆపేస్తుందని వారు సూచిస్తున్నారు. ఇలా కర్ణభేరి పనికి ఆటంకం కలిగించడం వలన చెవుడు వస్తుందట. అందుకే చెవులు క్లీనింగ్ చేయడానికి బయట నుంచి ఎలాంటి వస్తువులు వాడకూడదని పరిశోధకులు చెప్తున్నారు.