Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే...

కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే...
, శుక్రవారం, 22 నవంబరు 2019 (23:38 IST)
కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. కానీ, కరివేపాకు వల్ల వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం చక్కగా నమిలేస్తారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి.
 
కరివేపాకులో పౌష్టిక విలువలు మాత్రమే కాదు.. ఔషధ గుణాలు కూడాఎక్కువగానే ఉన్నాయి. కరివేపాకుని మధుమేహానికి మంచి మందుగా పాశ్చాత్యులు సైతం గుర్తించారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు చక్కెర వ్యాధిగ్రస్తుల పాలిట వరం అంటారు నిపుణులు. ఎలా అంటే, తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని  నిపుణులు పరిశోధనల ద్వారా తేల్చారు.
 
అంతేకాదు జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు అంటుంటారు.
 
పెద్దలకు మాత్రమే కాదు పిల్లల్లో ఆకలి మందగిస్తే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలు. ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది కూడా. కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు.. మెంతులు, మిరియాలు కూడా కలపాలి.

ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికీ కరివేపాకుని బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. పెరుగుతాయి కూడా. అంతేనా... జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఈ విధంగా రుచికే కాదు, ఆరోగ్యానికి, సౌందర్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుని తరచూ ఏదో ఒక రూపంలో తప్పక తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎత్తు తక్కువున్నవారికి డయాబెటిస్ వస్తుందా?