Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి సిత్రాలు - అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (20:27 IST)
Prawin Yendamu, Tanvi Akaanksha, Raghavendra Reddy, Ajay Kathurvar, Yash Puri
శ్వేతా పరాశర్‌, యష్‌ పూరి, అజయ్‌ కతుర్వార్‌, ప్రవీణ్‌ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. సోషల్‌ డ్రామాగా తెరకెక్కింది. ఈతరం యువత ఆలోచన, ఆందోళలన నుంచి సమాజంలో జరిగే పలు వాస్తవ అంశాలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ న్యూ ఏజ్‌ సినిమా గురువారం మిడ్ నైట్ నుండి అనగా సెప్టెంబర్ 24 నుండి ‘జీ 5’ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల కోసం గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనిట్ సభ్యులు మాట్లాడారు. 
 
చిత్ర సమర్పకులు రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ "ఈరోజు 'జీ 5' లాంటి గొప్ప ఓటీటీ వేదిక మా సినిమాను విడుదల చేస్తుండటం మాకు చాలా సంతోషంగా ఉంది. జీ సంస్థకు చెందిన అనురాధ మేడమ్, సాయి ప్రకాష్, నిమ్మకాయల ప్రసాద్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.
 
యష్ పూరి మాట్లాడుతూ "సినిమాలో రాగ్ పాత్రలో నటించాను. ఇంట్లో ఇంటీరియర్ కాంప్లెక్స్ గురించి ఫైట్ చేస్తూ సొంత మ్యూజిక్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించే ఓ యువకుడు. మంచి పాత్రలో నటించాను. ఇదొక డ్రీమ్ టీమ్. వీళ్ళతో పని చేసినందుకు సంతోషంగా ఉంద‌ని అన్నారు.  
 
ప్రవీణ్ యండమూరి మాట్లాడుతూ, ఇందులో దిలీప్ అనే పాత్రలో నటించాను. గ్రే షేడ్ ఉన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శకుడు సుప్రీత్ కి థాంక్స్. సినిమా విడుదల వరకూ వచ్చిందంటే, ఈ స్థాయిలో ఉందంటే రాఘవేంద్రరెడ్డి గారు, రాహుల్ రెడ్డి గారు ప్రధాన కారణం. జీ 5 వరకూ సినిమా చేరిందంటే రాఘవేంద్ర రెడ్డిగారు రీజన్. భవిష్యత్తులో అందరికీ ఇదే మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా సినిమాను విడుదల చేస్తున్న 'జీ 5'కు థాంక్స్" అని అన్నారు.
 
అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ "నేనొక బాక్సర్ పాత్రలో నటించాను. అతని వ్యక్తిగత-వృత్తిపరమైన జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? అనేది సినిమాలో చూపించారు. నాకు, యామినికి మధ్య క్యూట్ లవ్ స్టోరీ ఉంది. టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. మీడియా, ప్రేక్షకులకు థాంక్స్. మా సినిమాను తప్పకుండా చూడండి. ఇందులో చూపించినవన్నీ మంచి చిత్రాలే. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలు, యూనిట్ సభ్యులకు థాంక్స్. 'జీ 5'లో సినిమా విడుదల అవుతుంది" అని అన్నారు. 
 
తన్వి మాట్లాడుతూ "నేను యామిని పాత్రలో నటించాను. సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన ఆమె ప్రేమలో ఎలా పడిందనేది ఆసక్తికరం. యష్, యామినికి మధ్య మంచి ప్రేమకథ ఉంది. మా కథతో పాటు సినిమాలో మరో మూడు ప్రేమకథలు ఉన్నాయి. ప్రేక్షకులందరూ 'అలాంటి సిత్రాలు'ను 'జీ 5'లో తప్పకుండా చూడండి" అని అన్నారు.
 
దర్శకుడు సుప్రీత్ సి. కృష్ణ మాట్లాడుతూ "సినిమా చూశాక.ప్రేక్షకులు, విమర్శకులు క్రాఫ్ట్స్ గురించి మాట్లాడతారని అనుకుంటున్నాను. మా టెక్నికల్ టీమ్ లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. అందుకని, మా టీమ్ అందరికీ థాంక్స్. ప్రధాన తారాగణం అంతా అద్భుతంగా నటించారు. మేమంతా ఈ వేదికపై నిలబడ్డామంటే రాఘవేంద్ర రెడ్డిగారు కారణం. నాకు ఏ అవసరం వచ్చినా నిలబడిన రాహుల్ రెడ్డి అన్నకు థాంక్స్. 'అలాంటి సిత్రాలు' సినిమా గురించి చెప్పాలంటే... ఎంటర్టైన్మెంట్ గురించి కంటే కంటెంట్ గురించి అందరూ మాట్లాడతారు" అని అన్నారు. 
 
ఇరవైమూడేళ్ల రాగ్‌ గాయకుడు, గిటారిస్ట్‌. అతడు తన కంటే వయసులో పెద్దదైన ఓ వ్యభిచారి పట్ల ఆకర్షితుడవుతాడు. ఆమె జీవితంలో కొట్లాట, గొడవలు మానేసి సాధారణ జీవితం గడపాలని ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ దిలీప్‌ పాత్రేమిటి? బాక్సర్‌ కావాలని కలలు కనే యష్‌కు, ఈ ముగ్గురి కథకు సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
 
‘అలాంటి సిత్రాలు’ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైన్‌: రోహన్‌ సింగ్‌, ఎడిటింగ్‌ ్క్ష సౌండ్‌ డిజైన్‌: అశ్వథ్‌ శివకుమార్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ శివకుమార్‌, మ్యూజిక్‌: సంతు కుమార్‌, సమర్పణ: కె. రాఘవేంద్రరెడ్డి, ప్రొడ్యూసర్స్‌: సుప్రీత్‌ సి. కృష్ణ, లొక్కు శ్రీ వరుణ్‌, డి. రాహుల్‌ రెడ్డి, రైటింగ్‌ ్క్ష డైరెక్షన్‌: సుప్రీత్‌ సి. కృష్ణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments