Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దసరా కానుకగా మహాసముద్రం.. ట్రైలర్ విడుదల (Video)

Advertiesment
Maha Samudhram
Maha Samudhram
ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి చేస్తున్న సినిమా మహాసముద్రం. ఇది మల్టీస్టారర్ సినిమా కావడంతో, హీరోలను సెట్ చేసుకోవడానికి ఆయనకి చాలానే సమయం పట్టింది. ఈ సినిమా కథ పట్టుకొని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు అజయ్. 
 
ఎట్టకేలకు శర్వానంద్ -సిద్ధార్థ్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ సినిమానుంచి మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంటెన్స్‌ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ గురువారం విడుదలైంది. 
 
ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ , శరణ్య కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితపై ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు.. మా ఎన్నికలలో మరో ట్విస్ట్