Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవితపై ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు.. మా ఎన్నికలలో మరో ట్విస్ట్

Advertiesment
Prudhvi
, గురువారం, 23 సెప్టెంబరు 2021 (18:26 IST)
మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, సీవిఎల్ మధ్య పోటీ రసవత్తరంగా మారుతున్నాయి. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. మా ఎన్నికలలో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
 
సినీనటి జీవితా రాజశేఖర్ మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె పోటీ నుంచి తప్పుకుని ప్రకాష్ రాజ్ ప్యానల్లో చేరారు. అయితే తాజాగా మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‏గా పోటీ చేస్తున్న పృథ్వి.. జీవితపై ఎలక్షన్ ఆఫీసర్‏కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ ఆఫీసర్‏కు పంపిన లేఖలో పృథ్వీ.. జీవితపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 
తానెప్పుడూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ నిబంధనలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కానీ ఈ మధ్య ప్రస్తుతం మా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న జీవిత ప్రస్తుతం ఆమె చేస్తున్న కార్యకలాపాల మీద మాట్లాడాల్సి వస్తోంది. ఆమె పొజిషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఆమె కొందరిని ఇన్‌ఫ్లుయన్స్ చేస్తున్నారు. మా ఆఫీస్‌ని ఎన్నికల కాంపెయిన్‌కి వాడుకుంటున్నట్టు తెలిసింది. 
 
టెంపరరీ ఐడీ కార్డులు ఇస్తామని జీవిత కొందరిని మభ్యపెడుతున్నారు. తనకు ఓటేస్తే ఇలాంటి లాభాలుంటాయని చెప్తున్నారు. ఈ విషయం మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎన్నికల రూల్స్, కండక్ట్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ పృథ్వీ బహిరంగ లేఖ రాశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెలలో - నీ జతగా విడుదల