Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు తెరకు కొత్త నేప‌థ్యం ఎంచుకున్నారుః త్రివిక్రమ్

తెలుగు తెరకు కొత్త నేప‌థ్యం ఎంచుకున్నారుః  త్రివిక్రమ్
, గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:50 IST)
Getty team with trivikram
వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాతగా  సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన మూవీ ‘జెట్టి’. ద‌క్షిణాదిలో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా జెట్టి. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు కథ,  అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక. ఈ మూవీ పోస్టర్ ని దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్క‌రించారు. కథను తెలుసుకొని టీం ని అభినందించారు. బీమ్లానాయక్ షూటింగ్ లోకేషన్ లో ఈ పోస్టర్ లాంఛ్ జరిగింది. కొన్ని కథలు ఆ ప్రాంతపు హ‌ద్దులను దాటవు. వారి బాధలు ఆ కుటుంబాల గడపలు దాటవు. అలాంటి సబ్జెక్ట్ ను తెరమీదకు తీసుకు వచ్చిన దర్శకుడిని అభినందించారు త్రివిక్రమ్.
 
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, సముద్రపు బ్యాక్ డ్రాప్ లో కథలు ఎంచుకోవడం చాలా సాహాసంతో కూడుకున్నది. వీరి మేకింగ్ లో చాలా త‌ప‌న‌ కనపడింది. వీరు ఎంచుకున్న నేపథ్యం ఖచ్చితంగా తెలుగు తెరకు కొత్తది. సుబ్రమణ్యం పిచ్చుక తనదైన ముద్రతో వస్తున్నాడు. నిర్మాత వేణు మాధవ్ గారికి జెట్టి లో నటించిన నందిత శ్వేతకు ఇతర నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు.
 
దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ, త్రివిక్రమ్ గారిని కలవడం ఇదే మొదటి సారి ఆయన మా టీం తో పంచుకున్న మాటలు మాకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. జెట్టి మూవీతో ఇప్పటి వరకూ తెలుగు తెరపై కనిపించని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులు ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్నాం. అక్టోబర్ మొదటి వారంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుులు కంప్లీట్ అవుతాయని  అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్‌చ‌ర‌ణ్ ఆవిష్క‌రించిన‌ అన్నపూర్ణ స్టూడియోస్ వారి - అనుభవించు రాజా టీజర్