Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు "లవ్ స్టోరీ" విడుదల.. 2 క్లైమాక్స్‌లు.. అక్కడ రెండు లక్షల డాలర్స్ మార్క్‌!

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (19:09 IST)
లవ్‌స్టోరీ రేపు అంటే శుక్రవారం రిలీజ్ అవుతోంది. యువ హీరో నాగచైతన్య, స్టార్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న కాజల్ అగర్వాల్ మొదటి హాఫ్ చాలా చాలా ఎంటర్టైనింగ్‌గా సాగినప్పటికీ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుందట. 
 
ఈ సినిమాలో సాయి పల్లవి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి, నాగ చైతన్య డాన్సర్గా కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం రెండు విభిన్న క్లైమాక్స్ షూట్ చేశారట. అందులో ఒకటి సాడ్ కాగా మరొకటి హ్యాపీ ఎండింగ్ అని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. 
 
మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో లవ్ స్టోరి 640 థియేటర్స్ రిలీజ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 900 వరకు థియేటర్స్‌లో విడుదలకానుంది. 
 
ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి. ఇప్పటికే అక్కడ రెండు లక్షల డాలర్స్ మార్క్‌ను కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి లవ్ స్టోరీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments