Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆయ‌న వ‌ల్లే నటుడిగా, వ్య‌క్తిగా ఎదిగానుః నాగ చైతన్య

ఆయ‌న వ‌ల్లే నటుడిగా, వ్య‌క్తిగా ఎదిగానుః నాగ చైతన్య
, గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:35 IST)
Naga Chaitanya
`లవ్ స్టోరి` సినిమాలో మహిళలకు సంబంధించిన ఓ సున్నిత‌మైన అంశాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పబోతున్నారు. లింగ ప‌క్ష‌పాతం, కుల వివ‌క్ష‌త‌ను గురించి కథలో ముఖ్యంగా ఉంటుంది. పల్లవి అనే క్యారెక్టర్ ద్వారా ఈ విషయాన్ని కొన్ని చూపిస్తున్నామ‌ని` `లవ్ స్టోరి` క‌థానాయ‌కుడు నాగ చైతన్య తెలియ‌జేశారు.

 
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ శుక్రవారం థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో నాగ చైతన్య సినిమాలో నటించిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలను ఇలా తెలిపారు.

 
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. శేఖర్ గారి చిత్రాల్లో వాస్త‌విక విధానం ఉంటుంది. వాస్త‌విక చిత్రాలంటే నాకు ఆసక్తి. మజిలీ సినిమాలో ఈ సంతృప్తి కొంత దొరికింది. లవ్ స్టోరితో మ‌రోస్థాయికి హ్యాపీనెస్ పొందాను.

 
దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు. ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, వ్య‌క్తిగా ఎదిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకే ఆయనతో ఎక్కడిదాకా అయినా ట్రావెల్ చేస్తానని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.

 
ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను. ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాం. ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది.

 
శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువ పేరొస్తుంది. కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్ కు కూడా స‌మాన ప్రాధాన్య‌త‌ ఉంటుంది. ఇద్దరికీ మంచి పేరొస్తుంది. సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను. తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్.

 
కొరియోగ్రాఫర్ శేఖర్ `మాస్టర్ నా కాంబినేషన్ `శైలజా రెడ్డి అల్లుడు` సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది. `లవ్ స్టోరి`లోనూ మంచి స్టెప్పులు చేయించారు. పాటలన్నీ చాలా స‌హ‌జంగా ఉంటాయి. డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.

 
ఇటీవల సుకుమార్తో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం. సుకుమార్ కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు. తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు.

 
మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను. అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం. దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.

 
హార్ర‌ర్ సినిమా
కొత్త సినిమాల గురించి చెప్పాలంటే, థ్యాంక్యూ సినిమా చేస్తున్నా. ఇంకా 10రోజులు షూట్ వుంది. ఇక `బంగార్రాజు`లో నేనూ ఓ పార్ట్ పోషిస్తున్నా. అదేవిధంగా అమెజాన్‌లో విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేబోతున్నాను. ఇది కాకుండా ఓ హార్ర‌ర్ సినిమా చేస్తున్నా. అంటే సూప‌ర్ నేచుర‌ల్ ఎలిమెంట్ వుంటుంది. ఆ విష‌యాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హేష్‌బాబు బాట‌లోనే విజయ్ దేవరకొండ - ఏ.వి.డి సినిమాస్ ఘనంగా ప్రారంభం