Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్లో అల వైకుంఠపురములో, ఇంతకీ ఏ హీరోతో?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:35 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ అల.. వైకుంఠపురములో. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను మించిన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమా రీమేక్ హక్కులకు గట్టి పోటీ ఏర్పడింది. కోలీవుడ్, బాలీవుడ్ నుంచి రీమేక్ రైట్స్ కోసం పోటీఎక్కువైంది. 
 
అల.. వైకుంఠపురములో సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించినప్పటి నుంచి రీమేక్ రైట్స్ కోసం భారీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ నుంచి కబీర్ సింగ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం అల్లు అరవింద్‌ని సంప్రదించారని, అయితే.. మంచి అమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ ఇవ్వలేదు అని తెలిసింది. అది అపట్లో చర్చనీయాంశం అయ్యింది.
 
కారణం ఏంటంటే...  గీతా ఆర్ట్స్ సంస్థే అల.. వైకుంఠపురములో సినిమాని హిందీలో రీమేక్ చేయాలనుకుంటుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా బాలీవుడ్ ప్రొడ్యూసర్ అశ్విన్ వర్దే అల.. వైకుంఠపురములో రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలిసింది. 8 కోట్లకు ఈ రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. 
 
టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న ఈ మూవీని బాలీవుడ్‌లో ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియలేదు కానీ.. లీడ్ రోల్‌ను మాత్రం అక్షయ్ కుమార్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ ఎవరు అనేది ఫైనల్ అయిన తర్వాత స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. మరి.. టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ సాధించిన ఈ మూవీ బాలీవుడ్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments