లాక్ డౌన్.. బాలీవుడ్ సెలెబ్రిటీల హాట్ హాట్ వర్కౌట్లు

గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:08 IST)
లాక్ డౌన్ వల్ల బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇంట్లో వ్యాయామాలు చేస్తుంది. లాక్ డౌన్ పరిస్థితుల మధ్య ఫిట్‌గా ఎలావుండాలో చెప్పింది. మీడియాతో ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండటానికి పలు సూచనలు చేశారు.
 
"జంక్ ఫుడ్స్ తక్కువగానే తినండి. ఆరోగ్యకరమైన చిరుతిండికి ప్రాధాన్యత ఇవ్వండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోండి. రోజంతా చిన్నచిన్న వర్కౌట్స్ చేయండి. ఇదే కాకుండా శారీరకంగా కష్టపడి పనిచేసే ఇంటి పనులపై కూడా శ్రద్ధ చూపండి అని పేర్కొంది.
 
మరోవైపు 40 ప్లస్ ఏజ్ లోనూ కూడా బాలీవుడ్ నటి మందిరా బేడీ మరీ ఇంత ట్రిమ్ లుక్‌ను మెయింటైన్ చేస్తుంది. ఇక మందిర బేడీ తాజా వర్కౌట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
గోడకి రెండు కాళ్లు ఆనించి వేసిన తాజా ఆసనంలో చాలా హాట్ గాను ఉంది. బాడీని ఫర్ ఫెక్ట్‌గా మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఈ వయసులో ఆమె ఇంత నాజూకుగా.. హెల్దీగా వుండటం గొప్ప విషయమని నెటిజన్లు మందిరా బేడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం క్రాక్ నుంచి పోస్టర్ విడుదల.. శృతి, బాబుతో రవితేజ..