Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్య జగన్ అంటే.. కోడలు జై తెలుగుదేశం అంటోంది.. ఏంటి పరిస్థితి?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:36 IST)
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇటీవల సినీనటుడు అక్కినేని నాగార్జున కలిసిన సంగతి తెలిసిందే. అయితే తాను జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కింగ్ నాగార్జున వివరణ కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని కూడా తేల్చేశారు.


జగన్ తనకు మంచి స్నేహితుడని, వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కానీ నాగార్జున ఇలా చెప్పినా జగన్‌కు కింగ్ పరోక్షంగా మద్దతు తెలిపారని టాలీవుడ్‌ టాక్ వస్తోంది. 
 
ఇలా మామయ్య జగన్ వైపు వుంటే కోడలు మాత్రం జై తెలుగుదేశం అంటోంది. నాగార్జున కోడలు, హీరోయిన్ సమంత సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ''నేను మీ సమంత.. మన రేపల్లె మన అన్నగారు.. అభివృద్ధికి ఓటేయండి.. అనగాని సత్య ప్రసాద్‌ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు’ అంటూ సమంత రేపల్లె టీడీపీ అభ్యర్ధి సత్యప్రసాద్‌ని గెలిపించమని ఆ వీడియోలో ప్రజలను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments