Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనామా పత్రాల లీక్ కేసు : ఈడీ ప్రశ్నలతో ఐశ్వర్య ఉక్కిరిబిక్కిరి

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (07:15 IST)
పనామా పత్రాల లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆమైపై ప్రశ్నల వర్షం సంధించారు. దీంతో ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యారు. 
 
ఈ పనామా పత్రాల లీక్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. కానీ, ఆ సమయంలో ఆమె హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉన్నట్టుండి మరోమారు విచారణకు రావాల్సిందేనంటూ నోటీసులు జారీచేశారు. 
 
అయితే, ఈ రోజు విచారణకు రాలేనని ఆమె చెప్పినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం అంగీకరించలేదు. దీంతో ఆమె సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆ సమంయలో ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు ఆరు గంటల పాటు ఆమె వద్ద విచారణ సాగింది.
 
ఈ వ్యవహారంపై ఐశ్వర్య అత్త, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే బీజేపీకి దుర్ధినాలు రానున్నాయని ఆమె శాపనార్థాలు పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments