Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోన్నియన్ సెల్వన్ తర్వాత ఆ స్థాయి పాత్ర కింగ్‌ ఆఫ్‌ కోథా లో :చేశా ఐశ్వర్య లక్ష్మీ

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (13:46 IST)
Aishwarya Lakshmi
కెరీర్ బిగినింగ్ నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్నాను. ఎప్పటి నుంచో దుల్కర్‌ తో సినిమా చేయాలని వుండేది. ఇది వరకు కొన్ని ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరిగాయి కానీ కుదరలేదు. ఫైనల్ గా ఈ సినిమాతో కుదిరింది. దర్శకుడు అభిలాష్ జోషి ఈ సినిమా స్కేల్ గురించి చెప్పినపుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. చాలా బిగ్గెస్ట్ సినిమా. ప్రొడక్షన్ పరంగా భారీ చిత్రం. చాలా మాసీవ్ సెట్స్ వేశాం. ప్రతి షాట్ చాలా నిండుగా వుంటుంది. అచ్చమైన తెలుగు సినిమాలా వుంటుంది.హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ అన్నారు. 
 
దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో వుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
-  ఇందులో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాను. మట్టికుస్తీ లాంటి చిత్రాలలో పోల్చుకుంటే ఇందులో నా పాత్ర  స్క్రీన్ టైం తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధన్యత వుంటుంది. పోన్నియన్ సెల్వన్ లో నా పాత్ర సినిమా అంతా లేకపోవచ్చు, కానీ ఆ చిత్రంలో గుర్తుపెట్టుకునే పాత్రల్లో అదొకటి.  కింగ్‌ ఆఫ్‌ కోథా  లో కూడా అలాంటి ప్రాధాన్యత వున్న పాత్ర చేస్తున్నాను. నా పాత్రతో ఈ కథకు ఒక పరిపూర్ణత వస్తుంది.
 
-  దుల్కర్‌ సల్మాన్ ట్రూ జెంటిల్ మెన్. తనతో మాట్లాడితే ఏదైనా నేర్చుకునేలా వుంటుంది. ఏదైనా సలహా అడిగితే హెల్ప్ చేస్తారు. చాలా వినయంగా వుంటారు. నాకే కాదు దుల్కర్‌ తో వర్క్ చేయడం ఎవరికైనా ఆనందంగా వుంటుంది. ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తారు.
 
  నాకు అన్ని రకాల చిత్రాలు చేయాలని వుంటుంది. దసరా సినిమా నాకు చాలా నచ్చింది. అందులో కీర్తి సురేష్ పాత్ర నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర చేయాలని వుంటుంది. అలాగే మహానటి సినిమా కూడా చాలా ఇష్టం. సమంత గారి సినిమాలు కూడా ఇష్టం. ఓ బేబీ నా ఫేవరేట్. అలాగే సాయి పల్లవి కూడా చాలా ఇష్టం. ఫిదా రెండు సార్లు థియేటర్ లో చూశాను. నటనతో పాటు డ్యాన్స్ తో కట్టిపడేశారు. శ్రీలీల డ్యాన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తాను.
 
మీరు సినిమా చేయడానికి ఆసక్తిని కలిగించిన అంశాలు ఏమిటి ?
ఒక్క మాట లో చెప్పాలంటే.. దుల్కర్‌ సల్మాన్. అలాగే కథ, స్కేల్ చాలా గ్రాండ్ గా వుంటుంది. చాలా మంది వెటరన్స్  తో  కలసి పని చేసే అవకాశం దొరికింది.
 
ఈ కథ ఫిక్షనా.. లేదా యధార్థ సంఘటనలు ఆధారంగా తీశారా ?
 ఇది ఫిక్షనల్ స్టొరీ. కోథా అంటే టౌన్ అని అర్ధం. అదొక ఫిక్షనల్ టౌన్. ఐతే యధార్థ పరిస్థితులని ప్రతిబింబిస్తుంది. చాలా గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
 
కొత్త దర్శకుడు అభిలాష్ జోషి ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?
మట్టికుస్తీ షూటింగ్ సమయంలో ఈ కథని చెప్పారు. చాలా లాంగ్ నేరేషన్ ఇచ్చారు. నా పాత్రే కాదు సినిమాలోని అన్ని పాత్రలని వివరించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడే కథని విజువలైజ్ చేసుకున్నాను. ఏవైనా సందేహాలు అడిగినా ఎంతో వివరంగా నివృత్తి చేశారు. కొత్త దర్శకుడైనప్పటికీ ఎంతో అనుభవం వున్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని తీశారు. ప్రతి విషయం పట్ల అతనకి చాలా క్లారిటీ వుంది. అభిలాష్ తండ్రి గారు జోషియా వెటరన్ డైరెక్టర్. ఆయన చిత్రాలకు నేను ఫ్యాన్ ని. సెట్స్  లో  సమయం కుదిరినప్పుడు ఆయన చిత్రాల గురించి మాట్లాడుకునేవాళ్ళం.
 
- తెలుగులో నాకు అల్లు అర్జున్ గారు. తన స్టయిల్ తో ప్రేక్షకులని కట్టిపడేస్తారు. హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత, సాయి పల్లవి మధ్య టై పడుతుంది( నవ్వుతూ). అలాగే రీసెంట్ గా శ్రీలీల అంటే కూడా ఇష్టం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments