Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కింగ్‌ ఆఫ్‌ కోత మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్ : దుల్కర్‌ సల్మాన్

Dulquer Salmaan, Rana Daggubati, Nani, Aishwarya Lakshmi
, సోమవారం, 14 ఆగస్టు 2023 (10:28 IST)
Dulquer Salmaan, Rana Daggubati, Nani, Aishwarya Lakshmi
దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో వుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి, నేచురల్ స్టార్ నాని ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
 
దుల్కర్‌ సల్మాన్ మాట్లాడుతూ,  ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. గత ఏడాది అంతా ఈ చిత్రం పైనే వర్క్ చేశాం. నా కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ నేను బలంగా నమ్మి చేసిన గ్యాంగ్ స్టార్ డ్రామా. మీరంతా ఈ చిత్రాన్ని మెచ్చుకొని పెద్ద హిట్ కాదు బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇష్టపడే నాని గారికి చాలా థాంక్స్. నాని  ‘హాయ్ నాన్న’ కోసం ఎదురుచూస్తున్నాను. నా మిత్రుడు రానా. నేను తనని చీఫ్ అని పిలుస్తాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. భాషలకు అతీతంగా చిత్రాలని ఆదరిస్తున్నాను.  ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఐశ్వర్య, అనిఖా, .. ఇంకా చిత్రంలో భాగమైన అందరికీ థాంక్స్. అభిలాష్ జోషి కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. తెలుగులో నా వాయిస్ వుంటుంది. చాలా చక్కగా వుంది. మా పార్ట్నర్స్  జీ స్టూడియోస్ కి కృతజ్ఞతలు. ఆగస్ట్ 24 న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ చిత్రంలో  డ్యాన్స్ , యాక్షన్, సాంగ్స్ , ఎమోషన్స్ అన్నీ వుంటాయి. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. ఆగస్ట్ 24న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
 
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎక్సయిమెంట్ కలిగింది. దుల్కర్ ఒక యాక్షన్ సినిమా చేయడం ఈ ఎక్సయిట్మెంట్ కి కారణం. మా యాక్టింగ్ స్కూల్ దుల్కర్ నా జూనియర్. అక్కడి నుంచి తను పరిచయం. తను చాలా పద్దతైన వ్యక్తి. మృదు స్వభావి. తను ఇలాంటి యాక్షన్ సినిమా చేయడం చాలా ఎక్సయిటెడ్ గా వుంది. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద ఘన విజయం సాధించాలి’ కోరారు.
 
నాని మాట్లాడుతూ.. దుల్కర్‌ తన తెలుగు కెరీర్ స్టార్ట్ చేసినదాంట్లో నా వాయిస్ ('ఓకే బంగారం) కూడా వుంది. తెలుగులో తన కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళుతున్న ఈ తరుణంలో నేను ఈ వేడుకలో వుండటం చాలా ఆనందంగా వుంది. తన జర్నీలో నేను ఒక భాగం అనే ఫీలింగ్ వుంది.  దుల్కర్‌ చేస్తున్న చిత్రాలని చూస్తుంటే చాలా గర్వంగా వుంది. పాన్ ఇండియా అనే మాట నాకు పెద్దగా నచ్చదు కానీ నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది  దుల్కర్‌ మాత్రమే.హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం దర్శకులు దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్టర్ అనే మాటకు ఇది నిజమైన నిర్వచనమని భావిస్తున్నాను.  కింగ్‌ ఆఫ్‌ కోత’ చాలా ప్రామెసింగ్ గా కనిపిస్తోంది . ట్రైలర్ , విజువల్స్, మ్యూజిక్.. చాలా ఎనర్జిటిక్ గా వున్నాయి. ఐశ్వర్య గారి సినిమాలకి నేను ఫ్యాన్ ని. దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. సీతారామంతో దుల్కర్ మనందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ సినిమాతో అది నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. కింగ్‌ ఆఫ్‌ కోత’ పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించి, సినిమాలో భాగమైన అందరికీ స్పెషల్ ఫిల్మ్ గా నిలవాలని కోరుకుంటున్నాను.
 
ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. దుల్కర్‌, నేచురల్ స్టార్ నాని, రానా గారు లాంటి ఇండియన్ సినిమా గేమ్ చేంజర్స్ తో కలసి ఈ  వేదిక పంచుకోవడం అనందంగా వుంది. ప్రేక్షకులకు, అభిమానులు వారికి పంచిన ప్రేమలో నాకు కూడా కొంచెం ఇవ్వాని కోరుకుంటున్నాను(  నవ్వుతూ). కింగ్‌ ఆఫ్‌ కోత మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్స్ లో కలుద్దాం'' అన్నారు. ఈ వేడుకలో నిర్మాత శ్రవంతి రవి కిషోర్, నిమ్మకాయల ప్రసాద్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్న కాజల్ అగర్వాల్