Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుల్కర్ సల్మాన్ కింగ్‌ ఆఫ్‌ కోత నుంచి హల్లా మచారే పాట

kong of kota song
, సోమవారం, 31 జులై 2023 (10:16 IST)
kong of kota song
దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా  ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ మ్యూజికల్ జర్నీ ప్రారంభమైయింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి హల్లా మచారే అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ పుట్ ట్యాపింగ్ నెంబర్ గా ఈ పాటని స్వరపరిచారు జేక్స్ బిజోయ్. ఎల్‌వి రేవంత్, సింధూజ శ్రీనివాసన్ ఎనర్జిటిక్ గా  పాడిన పాటకు కృష్ణకాంత్ సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో దుల్కర్ సల్మాన్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
 
జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం యూనిక్ కంటెంట్, ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ వంటి ప్రముఖ తారాగణం ఉంది. చిత్రాన్ని ఈ ఏడాది ఓనం పండుగ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరలక్ష్మి శరత్‌కుమార్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో కోట బొమ్మాళి