కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

దేవీ
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (17:37 IST)
Vishnu Manchu
డివైన్ ‘కన్నప్ప’ తరువాత విష్ణు మంచు చేయబోయే ప్రాజెక్టులు, సినిమాలపై అందరి దృష్టి పడింది. ‘కన్నప్ప’లో అద్భుతమైన నటనను కనబర్చిన విష్ణు మంచు మీద ఆడియెన్స్ ఎంతలా ప్రశంసలు కురిపించారో అందరికీ తెలిసిందే. ఇక విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. 
 
ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతోన్నారు.  మైక్రోడ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతోన్నారు. మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్‌లో యూజర్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, ఎఫెక్టివ్ స్టోరీ, నెరేషన్‌తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట.
 
ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్-ఛేంజింగ్‌గా మారుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ పరిణామం గురించి తెలిసిన పరిశ్రమ వర్గాలు.. ‘ఈ ఏడాది ‘కన్నప్ప’తో అత్యంత చర్చనీయాంశంగా విష్ణు నిలిచారు. తరువాతి తరం కథలను ఎలా చెబుతుంది? అసలు ఎలాంటి కథలు తెరపైకి వస్తాయి? అని చర్చించుకునే స్థాయికి చేరుకున్నారు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా విష్ణు అందరిని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ మైక్రో డ్రామాలతో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు’ అని అనుకుంటున్నాయి. ఇవే కాకుండా మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments