Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

Advertiesment
Kannappa Review

డీవీ

, శుక్రవారం, 27 జూన్ 2025 (13:50 IST)
Kannappa Review
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా నేడే విడుదలైంది. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్ నటించిన సినిమా ఇది. ఇంతకు ముందు కన్నప్పపై సినిమాలు వచ్చాయి. మరి వాటికి దేనికి తేడా ఏమిటి చూద్దాం. 
 
కథ. 
తిన్నడు (విష్ణు) ఆటవిక జాతి నాయకుడు శరత్ కుమార్ కొడుకు. చిన్న తనం నుంచి దేవుడు లేడని నమ్ముతాడు. గ్రామంలో మనుషులను అమ్మవారు బలి కోరడం వ్యతిరేకిస్తాడు. పెద్దయ్యాక మరింత పెరుగుతుంది. ఇక ఆ చుట్టు పక్కల స్వర్ణముఖి నది ఒడ్డున వాయులింగం ఉంటుంది. దాన్ని తనకే స్వంతంగా మహాదేవ శర్మ (మోహన్ బాబు) పూజలు చేస్తూ, ఇతరులను రానీకుండా చేస్తాడు. 
Kannappa Review
 
ఈ లింగం మృత సంజీవని అనే భావనతో మరో ఆటవిక గ్రామ నాయకుడు దక్కించుకోవాలని చూస్తాడు. వారిని అడ్డు కునేందుకు చుట్టుపక్కల ఐదు గ్రామాల్లో నాయకులు కలిసి ఎదురుతిరిగి పోరాటం చేస్తారు. అప్పుడు తిన్నడు ఏమి చేశాడు. తిన్నడు ప్రేమ ఏమైంది. అసలు ఇందులో ప్రభాస్ పాత్ర ఏమిటి? శివుడు, పార్వతి పాత్రలు ఎలా లింక్ అయ్యాయి అనేది కథ.
 
సమీక్ష:
మొదట్లోనే ఇది శ్రీకాళహస్తి కథ. కొంత కల్పితం. సినిమాపరంగా ఫ్రీడమ్ తీసుకున్నామని చెప్పారు. అయితే కృష్ణం రాజు చేసిన భక్త కన్నప్పకు దేనికి తేడా ఉంది. తిన్నడు పాత్ర, ప్రేమించిన అమ్మాయి నేపథ్యాలు వేరుగా చెప్పారు. పురాణాల్లో ఉన్న కథలు మార్చి సినిమా వాళ్ళు తెస్తున్నారు. అందుకే ఇలాంటి సినిమాల కథలు నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం ఉంది. 
 
ఇక నటునిగా విష్ణు ఆటవిక పాత్రకు సరిపోయాడు. మోహన్ లాల్ పాత్ర నేపథ్యం బాగుంది. మోహన్ బాబు పూజారిగా అహం ఉన్న వాడిగా సరిపోయాడు. కథలో యాక్షన్ సీన్స్, ఆటవిక న్యాయం, సన్నీ వేషాలు బాగున్నాయి. కొన్ని చోట్ల సీజీఐ వర్క్ అని వేసి కైలాసం, విల్లుతో పోరాటం చూపించారు. 
 
ఇక, సినిమాలో రుద్రుడు (ప్రభాస్) పాత్ర వచ్చాకే జోష్ వస్తుంది. అసలు ఆ పాత్ర లేకపోతే సినిమా సప్పగా ఉండేది. తిన్నడు, రుద్రుడు మధ్య సన్నివేశాలు, మాటలు బాగున్నాయి. ఇందులో హీరోయిన్ పాత్ర వేష ధారణ మోడ్రంగా చూపించారు. 
 
బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలు వల్ల సినిమాకు ఒరిగింది లేదు. అలాగే కొన్ని పాత్రలు ఉన్నాయి. మొత్తంగా విష్ణు మంచి ప్రయత్నం చేశాడు. నటీనటులుగా హేమా హేమీలు చేశారు. అలాగే పది మంది రచయితలు పనిచేశారు. అందరూ కలిసి కష్టపడిన సినిమా. 
Kannappa Review
 
కానీ, శివ పురాణంలో గుడిలోకి రాగానే, అక్కడ ఉన్న మునులు కన్నప్పను హేళనగా చేస్తారు. తన అమాయకత్వంతో పూజ చేస్తుండగా, భూకంపం వస్తుంది. అప్పుడు కన్నప్ప శివ లింగంకు దెబ్బ తగులుతుందని తన దేహాన్ని అడ్డుగా పెడతాడు. ఇది అసలు కథ. కానీ సినిమా ఫ్రీడంతో చేశారు. 
 
రేటింగ్: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు