Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

దేవీ
సోమవారం, 26 మే 2025 (17:43 IST)
Dacoit Fire Glimpses poster
అడివి శేష్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్  డకాయిట్ ఫైర్ గ్లింప్స్ తెలుగు, హిందీలో రిలీజ్ అయ్యింది.  ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ తో ఫైర్ గ్లింప్స్ అదిరిపోయింది. శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య ఉద్రిక్త క్షణంలో గ్లింప్స్ ప్రారంభమౌతోంది. సానుభూతితో నిండిన వాయిస్ లో శేష్ ఆమెను "జూలియట్" అని పిలుస్తాడు, అందరూ ఆమెకు అన్యాయం చేశారని చెబుతాడు.  కానీ వెంటనే అతని వాయిస్ మారుతుంది. నేను నిన్ను మోసగించడానికి రాలేదు, అంతకంటే ఎక్కువ చేస్తా అని మిస్టీరియస్ స్మైల్ తో శేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.  
 
నెక్స్ట్ ఎపిసోడ్, ఖైదీ యూనిఫాం లో జైలు వ్యాన్ లో వున్న శేష్ కూల్ గా తన నోటి నుండి ఒక కీని బయటకు తెస్తాడు. తర్వాత ఓ రైలు వ్యాన్ మీదుగా దూసుకెళ్తుంది. చివరి సన్నివేశంలో, మృణాల్ అతని పక్కన కూర్చుంటుంది, శేష్ ఫైరింగ్ చేస్తాడు. ప్రేమ, ప్రతీకారం, మోసంతో నిండిన ఓ గొప్ప కథకు ఇది నాంది.
 
విజువల్ గా డకాయిట్ ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అడివి శేష్ ఇంటెన్స్ అండ్ రగ్గడ్  పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. మదనపల్లె యాసలో అదరగొట్టాడు. అతని వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా వున్నాయి. హిందీ వెర్షన్‌కు కూడా తనే డబ్బింగ్ చెప్పారు. అది అద్భుతంగా వచ్చింది.
 
మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆమె పాత్ర వెనక కథ చాలా ఆసక్తి కలిగిస్తుంది. అనురాగ్ కశ్యప్ ప్రజెన్స్ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. దర్శకుడు షానియల్ డియో విజువల్ ప్రజెంటేషన్ అదరగొట్టాడు. టీజర్  సినిమా స్కేల్ ఎంత బిగ్గర్ గా వుంటుందో తెలియజేసింది. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది.
 
సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన డకాయిట్ గొప్ప  థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోందని 'ఫైర్' గ్లింప్స్ ప్రామిస్  చేస్తోంది.
 
ఈ చిత్రం ఈ క్రిస్మస్, డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది. ఈ హాలిడే బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తొందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. శేష్‌కు ఇది తొలి హాలిడే రిలీజ్ కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments