Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రగంటి దర్శకత్వంలో నాని సరసన అదితి!

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (12:56 IST)
నేచురల్ స్టార్ నాని మంచిజోరు మీదున్నాడు. గత ఏడాది ‘కృష్ణార్జున యుద్ధం, దేవదాస్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, ఈ రెండు సినిమాలు ఫర్వాలేదనిపించడంతో తన తదుపరి ప్రాజెక్టుపై కాస్తంత జాగ్రత్తలు తీసుకున్నాడు. 
 
ఇప్పటికే ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నాని.. ఈ సంవత్సరం కూడా చాలా బిజీగా గడుపుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జెర్సీ’ ఇప్పటికే విడుదలకు సిద్ధమై ఈ వేసవిలో సందడి చేయబోతోంది. 
 
మరోవైపు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్‌లీడర్’ని ఇటీవలే పట్టాలెక్కించడం జరిగింది. ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే నాని మరో సినిమాను కూడా అంగీకరించేసారు. 
 
ఈ సినిమా తనను ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. మల్టీస్టారర్‌ సినిమాగా రూపొందనున్న ఆ చిత్రంలో నాని సరసన అదితిరావు హైదరి నటించబోతున్నట్లు సమాచారం. 
 
మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’లో సుధీర్ బాబు సరసన అదితి హీరోయిన్‌గా చేసి తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే ఇంద్రగంటి ఆమెకు మరో అవకాశం ఇచ్చారని అంటున్నారు. ఈ మల్టీస్టారర్‌లో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటించబోతున్నట్లు వినికిడి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments