Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్-2.. అధీరా అలా వుంటాడు.. మేకప్ కోసం గంట...

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (10:04 IST)
కేజీఎఫ్-2 త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే  ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ వంద మిలియన్‌ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న కేజీఎఫ్2పైన ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా, కేజీఎఫ్ 2 ట్రైలర్ కొత్త రికార్డులు  సృష్టించింది. బాలీవుడ్ చిత్రం గాని ఏ ఇతర భాషల మూవీస్ కాని ఈ రేంజ్‌లో వ్యూస్‌ని దక్కించుకున్న దాఖలాలు లేవట. 
 
ఇక ఈ చిత్రంలో హీరో యష్‌కి ఎంత ఇంపార్టెంట్ ఉందో విలన్‌గా అధీరా పాత్రకి కూడా అంతే ఇంపార్టెంట్ ఉందట. కేజీఎఫ్ 2 అంటే కేవలం యశ్ మాత్రమే కాకుండా సంజయ్ దత్ కూడా. అందుకే ఈ సినిమా బాలీవుడ్ రేంజ్‌లో క్రేజ్‌ను కలిగి ఉంది. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీరా పాత్రలో నటిస్తున్నాడు. మొదటి పార్ట్ లోనే అధీరా పాత్రకు సంబంధించిన పరిచయం ఇచ్చారు.
 
కాని పాత్రను మాత్రం పరిచయం చేయలేదు. అధీరా అంటే అత్యంత భయంకరమైన వ్యక్తి. అతి బల పరాక్రమవంతుడు, అతి భయంకరుడుగా చూడగానే కనిపించాలి. కనుక సంజయ్ దత్‌కు అత్యంత జాగ్రత్తగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ మేకప్ వేసేవారట మ్యాకప్ మ్యాన్. కాగా సంజయ్ షూటింగ్‌లో పాల్గొనాలంటే దాదాపుగా గంట నుండి గంటపావు వరకు మేకప్ కోసం సమయం కేటాయించేవారట.
 
ప్రతి ఒక్క డీటైల్‌ను తీసుకు వచ్చేందుకు ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా క్రూరుడుగా అనిపించేలావి కింగ్స్ వారియర్ రోల్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని డిజైన్ చేయడం జరిగింది. ప్రతి రోజు గంట పాటు ఎంతో ఓపికగా మేకప్ వేయించుకోవడంతో పాటు అంత మేకప్‌తో నటించడం అన్నా కూడా చాలా కష్టం. అంతటి కష్టాన్ని సంజయ్ దత్ భరించాడు కనుక ఖచ్చితంగా కేజీఎఫ్-2లో ఆయన పాత్ర అద్భుతం అని యూనిట్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments