Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయంవరం ప్రకటించుకున్న హీరోయిన్.... పందెం ఏంటంటే?

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (18:38 IST)
టాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ. తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. క్లిక్ కాలేక పోయింది. మంచి అవకాశాలు వచ్చినప్పటికీ సరైన హిట్లు లేక నిలదొక్కుకోలేక పోయింది. దీంతో సెకండ్ హీరోయిన్‌గా సైడ్ అయిపోయింది. కానీ, ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన హావభావాలతో పాటు.. చిత్ర విచిత్ర ఫీట్లు చేస్తూ నెటిజన్ల గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. 
 
తాజాగా ఆమె మరోమారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తనకుతాను స్వయంవరం ప్రకటించుకున్నారు. సరైన పెళ్లి కుమారుడు కోసం ఆమె ఈ స్వయంవరాన్ని ప్రకటించారు. ఇందులో పాల్గొనే యువకుల రంగు, కులం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇవేవీ తాను పట్టించుకోనని ట్వీట్ చేసింది. 
 
అయితే ఉల్లిపాయలు తిననివాడు అయ్యుండాలని, ముఖంపై చిరునవ్వు చెదరకుండా మూడు పూటలా వంట అతడే చేయాలని కొన్ని కండిషన్లు పెట్టింది. రెగ్యులర్‌గా షేవ్ చేసుకోవాలని, సంప్రదాయ దుస్తులే ధరించాలని షరతులు విధించింది. ఆదా శర్మ అంతటితో ఆగలేదు. మందు, మాంసం ఇంట్లోనూ, బయట నిషేధం అని స్పష్టం చేసింది.
 
పైగా, అతడికి తాగేందుకు ఐదు లీటర్ల నీటిని ప్రతి రోజూ అందిస్తానని తెలిపింది. దాంతోపాటే, భారత్‌లోని అన్ని భాషల చిత్రాలపైనా సదాభిప్రాయం కలిగి ఉండాలని, వాటిని ఆస్వాదించే మనసున్నవాడే తనను మనువాడొచ్చని ట్విట్టర్‌లో వెల్లడించింది. మొత్తానికి ఆదా శర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్లు చేసిందో కానీ, నెటిజన్లు మాత్రం భారీగా స్పందిస్తున్నారు. మరీ ఇన్ని సుగుణాలు ఉన్న వరుడు ఆమెకు దొరుకుతాడో లేదో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments