Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్లువొచ్చి గోదారమ్మ...' లవ్‌ యూ అంటున్న పూజాహెగ్డే

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (13:16 IST)
మెగా ప్ర్రిన్స్ వరుణ్ తేజ్ - పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "గద్దలకొండ గణేశ్". ఈ చిత్రం పేరు 'వాల్మీకి'. కానీ, విడుదలకు ఒక్క రోజు ముందు ఈ చిత్రం పేరు మారింది. అయితే, ఈచిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్‌కు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బులైపోతోంది. 
 
ముఖ్యంగా, అప్పుడెప్పుడో 'దేవత' చిత్రం కోసం శోభన్ బాబు, శ్రీదేవిలపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తీసిన 'ఎల్లువొచ్చి గోదారమ్మ...' పాటను అదే స్టయిల్‌లో దర్శకుడు హరీశ్ శంకర్ రీమేక్ చేశాడు. ఇక దీనికి థియేటర్‌లో ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సినీ అభిమానులు ఈ పాట వచ్చినప్పుడు ఎగిరి గంతులేస్తున్నారు.
 
దీనిపై హీరోయిన్ పూజా హెగ్డే ఓ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పూజా హెగ్డే, "ఇందుకోసమే నేను మైళ్లకు మైళ్లు వెళుతుంటాను. ఇటువంటి దృశ్యాలు చూస్తే, బాధలన్నీ మరచిపోతాం. మీ ఆనందం, థియేటర్లలో ఇలా నృత్యం చేయడం చూసి, మేము నిద్రలేని రాత్రులను, ప్రయాణాన్ని, ఎండలో నిలబ‌డి సినిమాలు చేయ‌డాన్ని... వీటన్నింటినీ మీ ప్రేమ ముందు మ‌రిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ ల‌వ్ యూ" అని కామెంట్ పెట్టింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments