Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ ఇక పనికిరాడు.. రోహిత్‌ను ఎంచుకోండి : శ్రీరెడ్డి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (11:22 IST)
లీడ్స్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఏకంగా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీనికి కారణం బ్యాట్స్‌మెన్ చెత్తగా ఆడటమే. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ నుంచి సిరాజ్ వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో కోహ్లీసేన చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ ఘోరపరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
కెప్టెన్ విరాట్ కోహ్లీ అసమర్థత వల్లనే ఈ ఘోర పరాజయం ఎదురైందని కామెంట్ చేస్తున్నారు. ఇక, ఈ లిస్ట్ లో శ్రీ రెడ్డి కూడా చేరింది. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించాలని, సారథిగా విరాట్ కోహ్లీ పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
 
మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. "కోహ్లీ ఓ చెత్త ఆటగాడని, అతని బ్యాటింగ్ పరమచెత్తగా ఉందని, రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని" కామెంట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments