Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి టెస్ట్ డ్రా : నిజంగా సిగ్గుచేటు అంటున్న విరాట్ కోహ్లీ

Advertiesment
తొలి టెస్ట్ డ్రా : నిజంగా సిగ్గుచేటు అంటున్న విరాట్ కోహ్లీ
, సోమవారం, 9 ఆగస్టు 2021 (14:55 IST)
భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య నాటింగ్‌హ్యామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ టెస్టు డ్రాగా ముగిసింది. టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 209 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట చివరికి ఓ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన కోహ్లీ సేన పటిష్ట స్థితిలో నిలిచింది. 
 
157 పరుగులు చేయాల్సి ఉండగా, చివరి రోజు వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. పదే పదే వర్షం పడుతుండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నిరాశాజనకంగా ముగిసింది.
 
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు నమోదు చేసింది. ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ నెల 12 నుంచి జరగనుంది.
 
అయితే, ఇంగ్లండ్‌తో తొలి టెస్టు చివరి రోజు వర్షం ఆటంకం కలిగించడం, మ్యాచ్ డ్రా కావడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ, కొంత అసహనం వ్యక్తం చేశాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్ డ్రా కావడం ఆవేదనకు గురి చేసిందన్నాడు. 
 
‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. లక్ష్య ఛేదనలో మేం మంచి స్థితిలో ఉన్నాం. గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం. కానీ, మూడో రోజో.. నాలుగో రోజో పడుతుందనుకున్న వర్షం.. ఐదో రోజు పడి మా ఆశలపై నీళ్లు చల్లింది. ఆ రోజు మొత్తం ఆట ఆడే వీలు లేకుండా పోయింది’’ అని వ్యాఖ్యానించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టోక్యో ఒలింపిక్స్ భారత పతక విజేతలకు ఉచిత విమాన ప్రయాణ ఆఫర్