Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ నోట్లో నుంచి కిందికి పోతుందన్నారు ఆయన, జీవితగారి వల్లే బతికా: నటి శివ పార్వతి

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (11:11 IST)
కరోనావైరస్ సామాన్యులతో పాటు సెలబ్రిటీలను సైతం పట్టుకుంటుంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు ఈ వైరస్ బారి నుండి బయటపడగా మరికొందరు ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఈ వైరస్‌తో పోరాడుతున్నారు. ఇదిలావుండగానే మంగ‌ళ‌వారం మరో ఇద్ద‌రు టాలీవుడ్ సింగ‌ర్లు సునీత‌, మాళ‌విక‌లకు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది.

కరోనావైరస్ బారిన పడిన మరో ఇద్దరు సింగర్స్... ఎవరు?
 
తాజాగా మ‌రో ప్ర‌ముఖ న‌టి శివ పార్వ‌తికి క‌రోనావైరస్ సోకింది. తనకు వైరస్ సోకిందన్న విష‌యాన్ని స్వ‌యంగా ఆమె సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. ప‌లు తెలుగు చిత్రాలు, సీరియ‌ల్స్‌ల‌లో న‌టించిన శి పార్వ‌తి ‘వ‌దిన‌మ్మ’ సీరియ‌ల్‌లో న‌టిస్తున్నారు. ఐతే త‌న‌కు క‌రోనావైరస్ సోకితే కనీసం ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు.
 
''కరోనావైరస్ పైన గొంతు లోనుంచి కిందికి వచ్చేస్తుందని ప్రభాకర్ గారు చెప్పారు, ఈ వైరస్ చికిత్సకు రెండు లక్షలు సరిపోదు, పది లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోండని అన్నారు. ఐతే వీరిలో ఏ ఒక్కరూ నన్ను పలుకరించినవారే లేరు. ఈ రోగంతో నేను రెండు ఆస్పత్రులు మారను. కానీ నేను ఎలా వున్నాను, ఎక్కడ వున్నానని ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి జీవితరాజశేఖర్ నేను ఎక్కడ వున్నానో తెలుసుకుని సాయం చేశారు.
 
 నేను ఇవాళ ఇలా బ్రతికి బయటపడ్డానంటే అది జీవితగారి చలవే. ఐతే మా యూనిట్ సభ్యులను నేనేమీ అనదలుచుకోలేదు. జస్ట్ థ్యాంక్స్ చెపుతున్నాను. ఎందుకంటే సీరియల్లో నటించి బయటకు వచ్చాక అక్కడ వారితో ఎలాంటి సంబంధం లేదని అనుకోవాలి. వారెవరో తెలియని వ్యక్తులుగా భావించాలి. వారంతా నన్ను అలాగే భావించారు. ఇంత దారుణంగా కూడా మనుషులు వుంటారా అని మొదటిసారి తెలుసుకున్నాను" అంటూ భావోద్వేగానికి గురయ్యారు శివ పార్వతి.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments