తెలంగాణ రాష్ట్రంలో మరో 1763 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 95,700కు చేరాయి. తాజాగా ఎనిమిది వైరస్ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 719కి చేరింది.
ఇకపోతే, 1,789 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 73,991 మంది వైరస్ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 20,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.7శాతం ఉండగా దేశంలో 1.92శాతంగా ఉందని, అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 77.31శాతంగా ఉందని ఇది దేశ సగటుకంటే ఎక్కువ అని వివరించింది.
తాజాగా నమోదైన 1,763 పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 484 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 169, రంగారెడ్డిలో 166 కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24గంటల్లో 24,542 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,97,470 మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.