Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి చీటింగ్... మండిపడిన ఫ్యాన్స్..

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (10:12 IST)
తమిళ హీరో సూర్య - సాయి పల్లవి - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన చిత్రం "ఎన్.జి.కె" (నంద గోపాల కృష్ణ). ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి తన అభిమానులను మోసం చేసిందట. దీంతో ఆమెపై అభిమానులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఫిదా భామ... దిగివచ్చి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిందట. ఇంతకు ఫ్యాన్స్‌ ఆమె ఎలా మోసం చేసిందో తెలుసుకుందాం.  
 
తమిళ హీరో సూర్య - సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు కలిసి నటించిన చిత్రం ఎన్.జి.కె. ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు అభిమానులతో చిట్‌చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను పంచుకోవాలని భావించిందట. అందుకు టైమ్‌ కూడా ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియపరిచింది. 
 
అయితే.. కొన్ని కారణాల ఈ భామ అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చాటింగ్ కోసం మేము ఎదురుచూస్తూంటే నువ్వు చీటింగ్ చేస్తావా..? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో.. అభిమానులకు సారీ చెప్పి, మళ్లీ సోషల్ మీడియాలో కలుద్దాం అంటూ సాయిపల్లవి తెలివిగా తప్పించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments