విభిన్న కథా చిత్రాల దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నాడని ఎన్నికల ముందు నుంచి టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడనే వార్త కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా లేదా అన్నది సందేహంగా మారింది.
ఏ కారణం చేతనో కానీ ఇప్పుడు ఈ కథను పక్కన పెట్టేశారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది. ఒక ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలు, ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడిన కథను కేఎస్ రవికుమార్ టేకాఫ్ చేశాడట.
ఈ కథలో ఒక తరం విలన్‌గా తాత, మరో తరం విలన్‌గా మనవడు కనిపిస్తారట. దానితోపాటు ఈ సినిమాలోని కొన్ని పాత్రలు పాత సినిమాలను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కథను టచ్ చేయకపోవడమే మంచిదని ఈ చిత్ర బృందం నిర్ణయించుకుందట.
అందులో భాగంగానే ముందుగా అనుకున్న సినిమా కాకుండా కాస్త వెరైటీగా కొత్త సినిమాను లైన్‌లో పెట్టే యోచనలో ఉన్నారు హీరో బాలకృష్ణ. మరో కొత్త కథ సిద్ధమయ్యేదాకా బాలకృష్ణ వేచి చూస్తాడో లేక ముందుగా బోయపాటితో అనుకున్న సినిమాను పూర్తి చేస్తాడో చూడాలి.