Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబు 27వ సినిమా స్టోరీపై అప్పుడే లీకులు..

Advertiesment
మహేష్ బాబు 27వ సినిమా స్టోరీపై అప్పుడే లీకులు..
, బుధవారం, 29 మే 2019 (18:17 IST)
హేష్ బాబు సినిమాలంటే షూటింగ్ కూడా మొదలు కాకుండానే వాటి గురించి చర్చించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అనిల్ రావిపూడితో ఇంకా తన 26వ సినిమా మొదలుకాకుండానే 27వ సినిమా గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి రావడం విశేషం. ముఖ్యంగా పరశురామ్ ప్రిన్స్‌ని తన లైన్‌తో ఇంప్రెస్ చేసినట్టుగా వచ్చిన న్యూస్ బాగా హైలైట్ అవుతోంది. 
 
స్టోరీ లైన్ మీద కూడా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చలు కొనసాగుతున్నాయి. ఎలా లీకయ్యిందో కానీ ఆ డిస్కషన్ ప్రకారం ఇందులో మహేష్‌ ఆర్థిక నేరాలు చేసే విలన్ భరతం పట్టే పాత్రలో వెరైటీగా కనిపించబోతున్నాడట. విలన్‌కు తన కుటుంబానికి లింక్ ఉండటంతో ముందు పర్సనల్‌గా తీసుకున్నా తర్వాత సమాజం కోసం ఫైట్ చేసేలా సాగుతుందట. 
 
ఇదంతా బాగానే ఉంది కానీ ఇది మరీ కొత్త లైన్ అయితే కాదు. అప్పుడెప్పుడో ఎస్వి కృష్ణారెడ్డి అచ్చం ఇదే తరహాలో జగపతిబాబు హీరోగా అతడే ఒక సైన్యం అని తీశాడు. అది అంతగా వర్క్ అవుట్ కాలేదు కానీ టీవీలో హిట్టు కొట్టింది. అందులో విలన్ ప్రకాష్ రాజ్ హీరో నాన్న సుమన్‌ను ఆర్థికంగా మోసం చేస్తాడు. మైండ్ గేమ్ ఆడి జగపతిబాబు అతన్ని పతనం చేస్తాడు. 
 
ఇదే ఫార్ములా సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్‌ల నాన్నకు ప్రేమతోలో చూడచ్చు. ఇది సీరియస్‌గా సాగే డ్రామా. మరి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన పరశురామ్ లైన్ వీటికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది.
 
నిజమో కాదో అధికారిక ధ్రువీకరణ లేదు కాబట్టి మహేష్ ఫ్యాన్స్ లైట్ తీసుకోవచ్చు. కథ ఎప్పటిదైనా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఈ కంపారిజన్స్ చేసేదేముండదు కానీ ప్రెజెంటేషన్‌లో జాగ్రత్తలు తీసుకోకపోతే మహర్షి తరహాలో కామెంట్స్ తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుచీలీక్స్.. ఐశ్వర్యా రాజేష్ లిప్ లాక్.. వైరల్ అవుతున్న ఘాటు ఫోటోలు