Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ నటిస్తానంటున్న రేణూ దేశాయ్.. పవన్ ఫ్యాన్స్ ఏమంటారో? (video)

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:30 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మళ్లీ నటిస్తానంటోంది. త్వరలోనే ఆమె కెమెరా ముందుకురానుందట. అదీ కూడా మూవీలో కాదు. ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సమ్మతం తెలిపి, సంతకం కూడా చేయడం జరిగిపోయిందట. అయితే, ఆమె మళ్లీ కెమెరా ముందుకు వస్తుండటం పట్ల పీకే ఫ్యాన్స్ ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
నిజానికి పవన్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత రేణూ దేశాయ్ ఒంటరిగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇష్క్ వాలా లవ్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రమంలో ఆమె మళ్లీ నటించనున్నారనే వార్తల గత కొన్ని రోజులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ వార్తలను ఆమె ధ్రువీకరించారు. ఓ అందమైన వెబ్ సిరీస్ కోసం సంతకం చేసినట్టు రేణు ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఫొటోషూట్ స్టిల్‌ను షేర్ చేశారు.
 
'మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉందని, వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో అందరి ఆశీర్వాదాలు, ప్రేమ కావాలని కోరారు. ఎంఆర్ కృష్ణ మామిడాల దర్శకుడిగా సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డీఎస్ రావు, ఎస్. రజనీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజం, న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళ కథ ఇదని' రేణు తెలిపారు. 

 
\

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments