Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా... అందాల రాశి

తనకు పెళ్లి చేసుకోవాలని ఉందనీ, అదీ కూడా తెలుగు అబ్బాయినే వివాహం చేసుకుంటానని అందాలబొమ్మ రాశి ఖన్నా చెబుతోంది. ఈమె తాజాగా నటించిన చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (12:11 IST)
తనకు పెళ్లి చేసుకోవాలని ఉందనీ, అదీ కూడా తెలుగు అబ్బాయినే వివాహం చేసుకుంటానని అందాలబొమ్మ రాశి ఖన్నా చెబుతోంది. ఈమె తాజాగా నటించిన చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. హీరో నితిన్ కాగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సతీశ్ వేగేశ్న దర్శకుడు.
 
తన సినీ కెరీర్‌పై రాశి స్పందిస్తూ, మనల్ని మనం నిరూపించుకుంటేనే మంచి అవకాశాలొస్తాయని 'తొలిప్రేమ' సినిమా నిరూపించింది. నా కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ ఆ సినిమా. దాని తర్వాత మంచి సినిమా చెయ్యాలనుకుంటున్నప్పుడు 'శ్రీనివాస కల్యాణం' ఆఫర్‌ వచ్చింది. ఇది మంచి సినిమా అవుతుందని కథ విన్నప్పుడే అనిపించి మిస్‌ కాకూడదనుకున్నా అలా ఈ చిత్రంలో ఛాన్స్ వచ్చినట్టు తెలిపారు. 
 
ఇక పెళ్లి విషయానికి వస్తే ఉత్తరాదికీ, దక్షిణాదికీ చాలా తేడా ఉంది. అయితే ఫీల్‌ ఒకటే. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు, ఇద్దరి మనసులు కలవడమే కాదు. రెండు కుటుంబాల మధ్య ఓ అనుబంధం కుదరడం. ఇది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. పద్దతులు ఆచారాలు వేర్వేరుగా ఉంటాయంతే. ఈ మధ్యన ఎక్కువమంది విడాకులు తీసుకోవడం చూసి పెళ్లి మీద నమ్మకం తగ్గిపోయిందన్నారు.
 
కానీ 'శ్రీనివాస కల్యాణం' సినిమా చేశాక పెళ్లిలో ఉన్న బలం ఏంటో తెలిసింది. ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అయిపోయావు కదా, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని కొందరు అడుగుతున్నారు. అది నా చేతిలో లేదు. దైవనిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments