Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా ఇలా వాడుకోలేదు.. మర్మభాగాలను కూడా షూట్ చేశారు.. ఎవరికి చెప్పుకోను...

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (15:02 IST)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బుజ్జిగాడు". ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ సంజనా గల్రాణి. తొలుత కన్నడంలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 
 
ఇపుడు ఈమె కూడా మీటూ ఉద్యమంపై స్పందించింది. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఒక్కొక్కరూ బహిర్గతం చేస్తున్నారు. అలాగే, సంజనా కూడా తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. హిందీ చిత్రంలో నటిస్తున్న సమయంలో తాను కూడా లైంగిక వేధింపులకు లోనైనట్టు చెప్పింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నేను 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టాను. అప్పుడు ప్లస్‌ఒన్‌ చదువుతున్నాను. ఆ సమయంలో సినిమాల్లో నటించి మళ్లీ చదువుకోవచ్చుననే ఆలోచనతో వచ్చాను. తొలి అవకాశం కన్నడంలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు హిందీ చిత్రం 'మర్డర్‌'ను చూపించి దీన్నే కన్నడంలో రీమేక్‌ చేస్తున్నామని చెప్పారు. అందులో పలు అశ్లీల సన్నివేశాలు చోటుచేసుకోవడంతో నేను నటించనని చెప్పాను. 
 
అందుకా దర్శకుడు 'మర్డర్‌' చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులకు తగ్గట్టుగా పలు మార్పులు చేస్తున్నట్లు చెప్పడంతో అందులో ఒక్క ముద్దు సన్నివేశంలో నటించడానికి మాత్రం నేను అంగీకరించాను. చిత్ర షూటింగ్‌ కోసం అమ్మతో కలిసి బ్యాంకాక్‌ వెళ్లడానికి అంగీకరించిన దర్శకుడు అక్కడకు వెళ్లిన తర్వాత అమ్మను షూటింగ్‌ స్పాట్‌కు రావొద్దని చెప్పారు. అక్కడ నాతో పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. 
 
చాలా అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయగా మేము చెప్పినట్లు చేయకుంటే నీ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరించారు. అలా ఎన్నో కలలతో వచ్చిన చిన్న పిల్లనైన నన్ను వారు ఇష్టానికి వాడుకున్నారు' అని నటి సంజనా గల్రాణి ఆవేదన వ్యక్తంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం