Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందులపై విరక్తి వచ్చి అలా చెప్పాను... సూసైడ్‌ వీడియోపై హీరోయిన్ వివరణ

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (15:24 IST)
తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె నిజంగానే ఆత్మహత్యకు పాల్పడుతుందా అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో మాధవీలత స్పందించింది. 
 
'డియర్ మీడియా మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు. కానీ, నేను బాగానే ఉన్నాను.. ఉంటాను. ఆ న్యూస్‌ని ప్రచారం చేయకండి. నా ఆరోగ్యం మాత్రమే బాగోలేదు. నేను చేసిన పోస్టు అర్థం ఏంటంటే... మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గుతుంది. నాకు మెడిసిన్స్ మీద విరక్తి వచ్చి అలా చెప్పాను. రిలాక్స్‌ కండి.. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను జస్ట్ క్యాజువల్‌గా నా ఆరోగ్య సమస్యలు తెలుపుతూ ఆ పోస్టు చేశాను. నా మైగ్రేన్ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను' అని నచ్చావులే అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన మాధవీలత వివరణ ఇచ్చింది. 
 
కాగా, ఈమెకు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యంపాలైంది.ఫలితంగా  తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. తన ఫేస్‌బుక్ పేజీలో చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసి, కలకలం రేపింది. తాను చచ్చిపోతాననే విషయాన్ని తన స్నేహితులతోనూ చెప్పింది. ఏదో ఒక రోజు 'ప్రేమ' సినిమాలో రేవతిలా తాను చచ్చిపోతానని పోస్ట్ చేసింది. 
 
తనను మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తున్నాయని తెలిపింది. మందులు వాడడం ఇష్టం లేకపోయినా వాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments