Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పై చేతులేసి ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. అంతే వేళ్లు విరిచేశా: తాప్సీ

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (11:10 IST)
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మీటూ పాకిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే దక్షిణాదిన క్యాస్టింగ్ కౌచ్ వివాదం పెను దుమారం రేపింది. ఈ వివాదాల కారణంగా పలువురు సెలెబ్రిటీలు తమ జీవితంలో సాగిన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతంగా పంచుకుంటున్నారు. ఇదే కోవలో ప్రస్తుతం సినీ నటి తాప్సీ కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఓ ఆకతాయి తనను అభ్యంతరకరంగా తాకాడని చెప్పుకొచ్చింది.  
 
కరీనా కపూర్ షో 'వాట్ ఉమెన్ వాంట్-2' లో ఆమె మాట్లాడుతూ.. గురుపూజ కోసం ఢిల్లీలోని గురుద్వారాకు కుటుంబ సమేతంగా వెళ్లానని, అప్పుడు అక్కడ విపరీతమైన రద్దీ ఉందని, అదే అదనుగా ఒక ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని చెప్పింది. తనపై చేతులేసి ఇబ్బందికరంగా ప్రవర్తించడం మొదలెట్టాడని తెలిపింది. అతని ప్రవర్తన హద్దు మీరడంతో రెండు వేళ్లు పట్టుకుని విరిచేశానని తాప్సీ వెల్లడించింది. 
 
ఇదిలా ఉండగా..  మహిళా టీమ్ ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ నటిస్తోంది. ఈ పాత్ర కోసం క్రికెట్‌‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది తాప్సీ. రీసెంట్‌‌గా రిలీజైన ఆమె ఫస్ట్ లుక్ చూస్తుంటే.. మిథాలీ పాత్రకి తాప్సీ పర్‌‌‌‌ఫెక్ట్ అనిపిస్తోంది. 
 
క్రికెటర్‌‌‌‌ డ్రెస్‌‌లో భారీ షాట్ కొడుతున్నట్టుగా ఉన్న ఈ పోజ్‌‌ ఆకట్టుకుంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో వయాకమ్ 18 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడు ఫిబ్రవరి 5న హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments