ప్రేమ మోసగాళ్లపై నటి ఇంద్రజ మండిపడ్డారు. ఇలాంటి వాళ్లకు పుట్టగతులుండవ్ అంటూ హెచ్చరిస్తూనే వారికి శాపనార్థాలు పెట్టారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ టాక్ షోలో ఇంద్రజ పాల్గొన్నారు. ఇందులోభాగంగా, ఈ తరం యువత ప్రేమ, బ్రేకప్‌లను తేలికగా తీసుకుంటున్నారని, దీనిపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ ప్రశ్నించారు.
దీనికి ఇంద్రజ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఒక బిడ్డకు జన్మనిచ్చేటపుడు కలిగే ప్రసవవేదన ఎంత తీవ్రంగా ఉంటుందో, ప్రమలో మోసపోతే కలిగే బాధ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అలా మోసం చేసింది ఆడైనా, మగైనా సరే వాళ్లకు పుట్టగతులుండవు. సర్వనాశనం అవుతారు. ఎవరైనా పుట్టింది ప్రేమించడానికి కాదు. సాధించడానికి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం నటి ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.