Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Advertiesment
Suresh Babu, Sri Nandu,Yamini Bhaskar

దేవి

, శుక్రవారం, 5 డిశెంబరు 2025 (18:50 IST)
Suresh Babu, Sri Nandu,Yamini Bhaskar
శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన  సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది.

ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి ధుమ్ ఠకుమ్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
 
నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. అందరికీ హాయ్. స్పిరిట్ మీడియాలో తేజ అనే ఆయన మాతో కలిసి వర్క్ చేస్తుంటారు. ఒక సినిమా ఉంది.. మీరు చూస్తే బావుంటుంది' అని కోరారు. సరే ఇంటికి రమ్మని చెప్పాను. వరుణ్ తో పాటు మరికొందరు వచ్చి  సినిమా చూపించారు. చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో తీసిన సినిమా ఇది. హై ఎనర్జీతో ఇంతకుముందు చేయని విధంగా చాలా అద్భుతంగా చేశారు. కొన్ని సీన్స్ లో నాకు తెగ నవ్వొచ్చింది. నందు నాకు పెళ్లిచూపులు అప్పటినుంచి తెలుసు. ఏవీఎం వారి బ్యానర్ కింద ఎఫర్ట్స్  నెవర్ ఫెయిల్ అని రాస్తారు. శరవన్ గారు నిన్న చనిపోయారు. ఆయనకి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఇప్పుడు రానా అక్కడే ఉన్నారు. నందు వరుణ్ వీళ్ళందర్నీ చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఈ సినిమా కోసం ఎఫర్ట్  పెట్టారనిపించింది.  చాలా పాషన్ తోచేశారు. చాలా రిస్క్ కూడా తీసుకున్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. 
 
రాఘవేంద్రరావు గారితో పాటు చాలా మందికి ఈ సినిమా చూపించాము. అందరు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్ ఎఫర్ట్ పెట్టి సినిమా ఇదనిపించింది.  అలాంటి స్పెషల్ ఎఫర్ట్ కి తప్పకుండా సపోర్ట్ చేయాలనిపించింది. నందు తను ఈ సినిమా కోసం ఒక ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్... ఇలా అన్ని రకాలుగా పనిచేశాడు. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టుగా అనిపించలేదు. సాయి మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సినిమా చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ సపోర్ట్ చేస్తే. ఒక సక్సెస్ఫుల్ టీం ముందుకు వచ్చినట్టుగా అవుతుంది. అందరికీ థాంక్యు.  
 
హీరో శ్రీనందు మాట్లాడుతూ,  లెజెండరీ రాఘవేంద్రరావు గారు మాతో మూడు గంటల పాటు టైం స్పెండ్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఆయనకి సినిమా చాలా నచ్చింది. మా అందరి పర్ఫామెన్స్ ని మెచ్చుకున్నారు. పెళ్లిచూపులు సమయంలో ఏదో ఒక రోజు సురేష్ బాబు గారితో సినిమా చేయాలని బలంగా కోరుకున్నాను. ఆ కల ఈరోజు నెరవేరింది. 19 ఇయర్స్ అని మొన్న చాలా ఎమోషనల్ అయ్యాను. దానికి చాలామంది మీకోసం మేమున్నామని స్పందించారు. అందరికీ థాంక్యు. 19 ఏళ్ల  నిరీక్షణ కి సురేష్ బాబు గారి వలన నెరవేరింది.  జీవితాంతం సురేష్ బాబు గారికి రుణపడి ఉంటాను. సురేష్ బాబు గారు ఎంతోమందిని హీరోలుగా చేశారు. సురేష్ బాబు గారు ఈ సినిమా కొన్న రోజు నా ఆనందానికి హద్దులు లేవు. నాకు మాటలు రాలేదు. జీవితంలో అంత ఆనందంగా ఎప్పుడూ లేను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు గొప్ప ఆనందంతో ప్రయాణం చేస్తున్నాం. ఈ సినిమా తర్వాత కూడా ఆ ప్రయాణం సాగుతుందని ఆశిస్తున్నాను.  రానా గారికి సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. సురేష్ ప్రొడక్షన్స్ స్పిరిట్ మీడియా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  
 
హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ, రామానాయుడు స్టూడియోలో మా సినిమా పోస్టర్ చూసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది మాకు చాలా గొప్ప విషయం. టీజర్ తర్వాత ట్రైలర్ కి పదింతలు ఎనర్జీ వచ్చింది. సినిమా మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన నందు వరుణ్ కి థాంక్యూ.
 
మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సురేష్ బాబు గారు   సాంగ్ ని లాంచ్ చేయడం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది. నేను నందు వరుణ్ ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా మూడేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం. ఈ సినిమాలో కూల్ మ్యూజిక్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. డిసెంబర్ 12న అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ లో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్