Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

Advertiesment
Priyadarshi

దేవీ

, గురువారం, 20 నవంబరు 2025 (17:03 IST)
Priyadarshi
ఒక ప్రేక్షకుడిగా నేను చూడాలనుకున్న సినిమాల్ని మంచి కథల్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాను. మన భాషా సంస్కృతి గొప్పవి. మన దగ్గర ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. నేను కాస్త విలక్షణమైన కథలు చేస్తాననే గుర్తింపు ప్రేక్షకులు ఇచ్చారు. అ బాధ్యతతో ప్రేక్షకుల దగ్గర గౌరవం ప్రేమ గెలుచుకోవాలని సినిమాలు చేస్తున్నాను అని ప్రియదర్శి తెలిపారు.
 
ప్రియదర్శి రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే. ఆనంది హీరోయిన్. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
ప్రేమంటే.. మీరేమనుకుంటారు?
-ప్రేమలో రెండు భాగాలు ఉంటాయి. మన కవులు గొప్ప గొప్ప దర్శకులు ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పారు చూపించారు. అదంతా థియరీ. అయితే మనకి ప్రేమ యొక్క అప్లికేషన్ కూడా అర్థం కావాలి. అది ఎక్కువసార్లు పెళ్లి ద్వారానే అర్థమవుతుంది.
 
-మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మొదలయ్యే జీవితంలో చాలా డైనమిక్స్ మారుతాయి. ప్రేమంటే ఇంత బాగుంటుంది అని అనుకోవడం దగ్గరనుంచి ఇలా కూడా ఉంటుందని ఇందులో చూపించడం జరుగుతుంది. సినిమా అందరూ రిలేట్ చేసుకునేలా వుంటుంది.
 
థ్రిల్ ప్రాప్తిరస్తు ట్యాగ్ లైన్ పెట్టడానికి కారణం?
-మ్యారేజ్ అంటే థ్రిల్లింగ్ గా ఉండాలి అని భావించే ఒక అమ్మాయి. మీకు టీజర్ ట్రైలర్ లో కూడా అది కనిపించే ఉంటుంది. ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి థ్రిల్ గా ఉండొచ్చు. ఇందులో అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది.
 
సుమ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
సుమ అక్క లెజెండ్.  ప్రతిరోజు చాలెంజ్ ని ఎదుర్కొంటూ గొప్పస్థాయి వెళుతోంది. తనని కేవలం ఒక యాంకర్ గా కాకుండా వ్యక్తిగా నటిగా చూడడం చాలా బాగా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను చాలా స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతుంది. తను ఎప్పుడు కూడా ప్రజెంట్ లోనే ఉంటుంది. ఆ క్వాలిటీ తన నుంచి నేర్చుకున్నాను. 
 
పెళ్లి, విడాకుల గురించి ఈ సినిమాలో ప్రత్యేకమైన సందేశం ఉంటుందా?
-మేము సందేశం ఇవ్వదలుచుకోలేదు. పెళ్లి విడాకులు ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ టాపిక్స్.  ఇద్దరు తమ ప్రాబ్లం ని ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఈ సినిమాలో చూపించాం. అందులో నుంచి ఎవరైనా మెసేజ్ తీసుకుంటే తీసుకోవచ్చు. అంతేగాని  ప్రత్యేకంగా మెసేజ్ ఇవ్వడం అంటూ ఉండదు.
 
మీరు చేసిన క్యారెక్టర్స్ కి మీ పర్సనల్ లైఫ్ కి ఏదైనా పోలికలు ఉన్నాయా?
-నా క్యారెక్టర్స్ కి నాకు సంబంధం ఉండదు. నాకున్న ఐడియాలజీల్ని నా క్యారెక్టర్స్ మీద రుద్ద దలుచుకోలేదు. నేను అనేవాడు లేకుండా నేను క్యారెక్టర్స్ లోకి ఎంటర్ కావాలి .అప్పుడే ఇలాంటి సినిమాలు, ప్రయోగాత్మ చిత్రాలు చేయగలను. నన్ను నేను వెనక్కి పెట్టుకుంటేనే కొత్త తరహా పాత్రలో చేయగలుగుతాను. మల్లేశం బలగం కోర్టు అలా వచ్చిన చిత్రాలే. ఎవరైనా మీ స్టైల్ లో ఒక సినిమా చేద్దామంటే నాకేం స్టైల్ లేదు మీరు ఏదైనా కొత్తగా చెప్తే అదే నా స్టైల్ అవుతుందని చెప్తుంటాను. ఏదైనా కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ అవుతుంది.
 
కొత్తగా చేయబోతున్న సినిమాలు?
-పొలిటికల్ థ్రిల్లర్ గా అసమర్ధుడు సినిమా చేస్తున్నాను. అలాగే థ్రిల్లర్ జానర్ లో సుయోధన సినిమా చేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల