Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Advertiesment
Raju Weds Rambai team

దేవీ

, గురువారం, 20 నవంబరు 2025 (15:21 IST)
Raju Weds Rambai team
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ - ప్రతి కుటుంబంలో కూతురుని గారాబంగా చూసుకునే తండ్రి ఉంటాడు, ఆ కూతురు తండ్రి అంటే భయపడుతూనే, ప్రేమించే ఒక అబ్బాయి ఉంటాడు, ఈ అమ్మాయినే కోరుకున్న అబ్బాయి ఉంటాడు. ఈ ముగ్గురు పడే సంఘర్షణే ఈ కథ. రాజు, రాంబాయి పాత్రలను ప్రతి ప్రేమ జంట రిలేట్ చేసుకుంటారు. అఖిల్ మరో విజయ్ దేవరకొండ అవుతాడు. తేజస్వినీలో నాకు మరో సాయి పల్లవి కనిపించింది. ఈ సినిమా తర్వాత చైతన్య డేట్స్ దొరకడం కష్టమే. సినిమాను చూసి నచ్చితే అందరికీ చెప్పండి. అన్నారు.
 
డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ - ఇది ఊరి కథ అని కొందరు చులకనగా మాట్లాడుతున్నారు. అవును నేను ఊరోడినే. నా ఊరంటే నాకు ప్రేమ, ఆ ఊరిలో ఉండే మనషులు ఇష్టం. అక్కడి కథలతోనే సినిమాలు రూపొందిస్తా. మా సినిమాలో హెలికాప్టర్ షాట్స్, మెట్రో షాట్స్ లేవు. ఊరిలో ఆటోడ్రైవర్, కాలేజ్ కు వెళ్లే అమ్మాయి..వీళ్లే ఉంటారు. మీకు సినిమా నచ్చకుంటే లైట్ తీసుకోండి కానీ నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. సినిమా బాగా లేదనే నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట చౌరాస్తాలో అర్థనగ్నంగా తిరుగుతా. ఛాలెంజ్ చేస్తున్నా. 15 ఏళ్లు బయటకు రాకుండా సమాధి చేయబడిన ప్రేమ కథ ఇది. ఈ సినిమా కోసం నేనూ మా టీమ్ పగలూ రాత్రీ కష్టపడ్డాం. ఆ బాధతో చెబుతున్నాం నెగిటివ్ ప్రచారం చేయకండి. అన్నారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - అఖిల్, తేజస్వినీ జంటను చూస్తుంటే మన ఊరిలో అరుగుమీద కూర్చుని సరదాగా మాట్లాడుకునే జంటలా అనిపిస్తున్నారు. డైరెక్టర్ సాయిలును చూసినప్పుడు అతనిలో నిజాయితీ కనిపించింది. రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ చూస్తుంటే ప్రతి షాట్ కొత్తగా అనిపించింది. అదే విషయాన్ని సాయిలుకు చెప్పాను. ఊరి కథలు ప్రేక్షకులు చూస్తారా అంటే తప్పకుండా చూస్తారు మనలో 80శాతం మంది ఊరి నుంచి వచ్చినవాళ్లమే. సినిమాలను ఎక్కువగా ఆదరించేది ఊరి వాళ్లే. నేను చాలా దారుణాలు విన్నాను గానీ వీళ్లు వచ్చి సినిమా క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇలాంటిది జరిగిందా. మా ఊరు చుట్టుపక్కల ప్రేమ కథల్లో కూడా దారుణాలు జరిగాయి గానీ ఇలాంటివి నిజంగా జరిగిందా, ఇలా చేస్తారా, ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించింది. మీకు అందుబాటులో ఉండేలా 99 రూపాయలకే టికెట్ రేట్ పెట్టారు. మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్