Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజ‌లి న‌టించిన 3డి దెయ్యం "లీసా" సెన్సార్ రిపోర్ట్ ఏంటి.?

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (18:40 IST)
దెయ్యాల కథలతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. హార్ర‌ర్ జోనర్‍లో దెయ్యం కాన్సెప్ట్ బిగ్ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తోంది "లీసా". దెయ్యాల్ని లైవ్ 3డిలో చూడబోయే త్రీడీ చిత్రం. సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 24న విడుదల కానుంది. ఇది రెగ్యులర్ దెయ్యం కాదు.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే 3డి దెయ్యం ఇది. 
 
థియేటర్లలో ద‌డ‌ద‌డ‌ లాడిస్తుంది. ప్రేక్షకుడికి గజగజను పరిచయం చేసే అరుదైన దెయ్యం ఇది. ది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. సౌండ్ ఎఫెక్ట్స్ .. అందుకుతోడు 3డి విజువల్స్ ఆద్యంతం థియేటర్లలో ప్రేక్షకుడిని గగుర్పాటుకు గురి చేయడం ఖాయం. "లీసా" 3డి రెగ్యులర్ సినిమా అని భావిస్తే పప్పులో కాలేసినట్టేనని సమర్పకుడు వీరేష్ కాసాని అంటున్నారు. ఈనెల 24న థియేటర్లలోకి వస్తోంది బూచమ్మ.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. పక్కా కాన్ఫిడెన్స్ అని తాజాగా ప్రీవిజువల్స్ చూసి చెబుతున్నారాయన. అన్ని పనులు పూర్తయ్యాయి. 24వ తేదీన థియేటర్లలోకి వస్తోందని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు. ఇండస్ట్రీ బెస్ట్ హార్ర‌ర్ చిత్రం చూడబోతున్నాం. ఈ సినిమా రాకపై ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాం. 
 
"జర్నీ.. షాపింగ్ మాల్" వంటి సినిమాలు యూనిక్ స్టైల్‌లో కొత్త కంటెంట్‌తో వచ్చిన సినిమాల్ని మా ఎస్.కె పిక్చర్స్‌లో అందించాం. ఈ సినిమా ఎంపికకు కారణం ఎక్స్‌క్లూజివ్ స్టైల్.. గత చిత్రాల్ని మించి వినూత్నమైన అనుభూతిని అందించే చిత్రం అవుతుందన్న నమ్మకంగా ఉన్నాం. ముఖ్యంగా 3డి విజువల్స్ ఫెంటాస్టిక్ అని ప్రశంసలు కురవడం ఖాయం. కథాంశం సింపుల్‌గా కనిపించినా ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్‌తో రక్తి కట్టిస్తుంది. 
 
ఈ సినిమాని చూసిన సెన్సార్ స‌భ్యులు స్పందిస్తూ... అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళితే.. అక్కడ దెయ్యం అనుభూతుల గురించి కథలు కథలుగా చెబుతుంటే మనంవిని ఎంతో ఎగ్జైట్ అయ్యేవాళ్లం. ఈ సినిమా చూశాక అంతకుమించి ఎగ్జయిట్ అవుతారు. తిరిగి చిన్నప్పటి ఆత్మల కథలు.. దెయ్యం కథలు గుర్తుకొస్తాయి. కథానాయిక గ్రాండ్ పేరెంట్ ఇంట్లో దెయ్యాల్ని లైవ్‌గా చూస్తారు ఈ సినిమాలో. కుర్చీ అంచున కూచుని చూసేంత ఎగ్జయిట్ మెంట్ ప్రతి ఫ్రేమ్ లోనూ ఉంటుంది. బోర్ కొట్టింది.. అన్న ఫీల్ ఆడియెన్‌కి కలగనే కలగదు అని తెలిపారు. లీసా 3డి చిత్రానికి రాజు విశ్వనాథం దర్శకత్వం వహించారు. సంతోష్ దయానిధి సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments