Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూత: సోషల్ మీడియా కన్నీరు

ప్రముఖ సినీనటి, అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దాటక దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందార

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (09:00 IST)
ప్రముఖ సినీనటి, అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దాటక దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. దశాబ్ధాల పాటు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా రాణించిన శ్రీదేవి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె మరణవార్త తెలిసి దేశం మొత్తం మూగబోయింది. 
 
సినీ ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలీవుడ్ నటుడు మోమిత్ మార్వా వివాహం కోసం భర్త బోనీకపూర్‌, చిన్న కుమార్తె ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు సంజయ్ కపూర్ ధ్రువీకరించారు. శ్రీదేవి మరణవార్త తెలిసిన ప్రముఖులు ఆమె ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ''దడాక్'' చిత్ర షూటింగ్‌ కారణంగా ముంబైలోనే వున్న శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి విషయం తెలిసిన వెంటనే దుబాయ్ వెళ్లిపోయినట్టు సమాచారం.
 
శనివారం రాత్రి దుబాయ్ లో ప్రముఖ సినీ నటి శ్రీదేవి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో సోషల్ మీడియా కంటతడి పెడుతోంది. శ్రీదేవి మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం, అభిమానులు షాక్‌కు గురయ్యారు.  పెళ్లివేడుకకు భర్త బోనీ కపూర్‌తో వివాహానికి హాజరైన సందర్భంగా శ్రీదేవి ఆనందంగా, హుషారుగా కనిపించారు. శ్రీదేవి మరణవార్తపై సోషల్ మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె మరణాన్ని నమ్మలేకపోతున్నామంటూ కొందరు కన్నీరు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments