Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్యాటక క్యాలెండర్‌లో క్లీవేజ్ షోనా..? ప్రియాంక చోప్రాకు కొత్త తలనొప్పి?

అసోం పర్యాటక క్యాలెండర్‌లో క్లీవేజ్ షోతో కూడిన ప్రియాంక చోప్రా ఫోటోలు ప్రస్తుతం కొత్త చర్చకు కారణమయ్యాయి. అసోం రాష్ట్ర పర్యాటక శాఖ కోసం బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ అంశంపై

Advertiesment
పర్యాటక క్యాలెండర్‌లో క్లీవేజ్ షోనా..? ప్రియాంక చోప్రాకు కొత్త తలనొప్పి?
, గురువారం, 22 ఫిబ్రవరి 2018 (12:20 IST)
అసోం పర్యాటక క్యాలెండర్‌లో క్లీవేజ్ షోతో కూడిన ప్రియాంక చోప్రా ఫోటోలు ప్రస్తుతం కొత్త చర్చకు కారణమయ్యాయి. అసోం రాష్ట్ర పర్యాటక శాఖ కోసం బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఆ ఫోటోలు అసోం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా వున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ అంశంపై అసోం అసెంబ్లీని కుదిపేసింది. క్లీవేజ్ షోతో కూడిన ప్రియాంక ఫోటోల్లో ధరించిన గౌన్ అసోం సంప్రదాయాలకు విరుద్ధమని కాంగ్రెస్ అసెంబ్లీ రచ్చ రచ్చ చేసింది. పర్యాటక ఆదాయం కోసం ప్రభుత్వం ఇంతగా దిగజారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. పర్యాటక రంగంతో పాటు ఇతరత్రా ప్రభుత్వ ప్రకటనల్లో నటీమణులు గౌరవప్రదంగా కనిపించాలే తప్ప.. ఇలాంటి అర్థనగ్న ప్రదర్శనలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. టూరిజం బ్రాండ్ అంబాసడర్ గా వెంటనే ప్రియాంకను తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
కానీ అసోం పర్యాటక మంత్రి హిమంత బిస్వా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతోందని దుయ్యబట్టారు.  ప్రియాంక ఫొటోల్లో అసభ్యత లేదని క్లారిటీ ఇచ్చారు. అస్సామీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్నీ రకాల దుస్తులు ధరిస్తుంటారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకే ప్రియాంక చోప్రాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరతకు చైనా, పాక్ పక్కా ప్లాన్ వేస్తున్నాయ్: ఆర్మీ చీఫ్