Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియా అరెస్టుకు రంగం సిద్ధం... డ్రగ్ మాఫియాలో బడా స్టార్ల పేర్లు??

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:42 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్టయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో వెల్లడించిన రియా.. రెండో రోజు కూడా ఎన్.సి.బి అధికారుల ఎదుట హాజరైంది. 
 
ఆదివారం జరిగిన తొలి రోజు విచారణలో కీలక విషయాలను రాబట్టిన ఎన్.సి.బి... రియా చక్రవర్తి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే.. ఆమె తొలి రోజు విచారణకు ఆలస్యంగా హాజరుకావడం వల్ల రెండో రోజు కూడా విచారణకు పిలిచినట్లు ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ప్రకటించారు.
 
సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నానని ఎన్‌సీబీ విచారణలో రియా అంగీకరించింది. అయితే డ్రగ్స్ అతనికి మాత్రమే ఇచ్చానని.. తాను మాత్రం వాడలేదని రియా విచారణలో చెప్పుకొచ్చింది. దీంతో.. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం ఉందని నిర్ధారించిన ఎన్‌సీబీ మరింత లోతుగా విచారణ చేయాలని భావిస్తోంది. 
 
కాగా, ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఇప్పటికే ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. సుశాంత్ డ్రగ్స్ వినియోగించిన వ్యవహారంలో రియా పాత్ర ఉందని కూడా తేలడంతో ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
 
మరోవైపు, ఎన్.సి.బికి రియా ఇచ్చిన వాంగ్మూలంలో అనేక మంది బడాస్టార్ల పేర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్న రియా, కేదార్‌నాథ్‌ సమయంలో తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. 
 
సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఎవరికీ తెలియదని, అతను చెబితేనే తాను వాట్సప్‌ గ్రూప్‌లో చాట్‌ చేస్తానని, అవి సుశాంత్ స్టాఫ్‌ మెంబర్స్‌ ద్వారా డెలివరీ అవుతుంటాయని రియా వెల్లడించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments