Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌కు నిశ్చితార్థం.. నెట్టింట ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:41 IST)
Gutta Jwala_Vishnu vishal
ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు నిశ్చితార్థం జరిగింది. తమిళ హీరో విష్ణు విశాల్‌తో ఆమె నిశ్చితార్థం జరిగిందనే ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విష్ణును వివాహం చేసుకోబోతున్నానని గుత్తా సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. వీరిద్దరు తాజాగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. 
 
సోమవారం గుత్తా 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ప్రేయసికి శుభాకాంక్షలు చెబుతూ విశాల్‌ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. గుత్తా జ్వాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విష్ణు.. మన జీవితాలకు కొత్త ఆరంభమన్నాడు.
 
ఇలానే పాజిటివ్‌గా వుందామని.. మన బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు వేద్దామని.. తమకు అందరి ఆశీర్వాదాలు కావాలని కోరాడు. తమ కోసం అర్థరాత్రి సమయంలోనూ ఉంగరం తెచ్చిన గుత్తా జ్వాల మేనేజర్ బసంత్‌ జైన్‌కు ధన్యవాదాలని పేర్కొన్నాడు 
 
దీనికి బసంత్‌ జైన్‌ స్పందిస్తూ.. 'ఎస్‌.. ఇద్దరికీ శుభాకాంక్షలు' అని కామెంట్‌ చేశారు. 'నూతన ఆరంభం' అంటూ గుత్తా కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే, పుట్టినరోజునే వీరు నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకుట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉంగరంతో తీసుకున్న ఫొటోల్ని విష్ణు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments