Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మిస్టీ ముఖర్జీ మృతి

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (15:00 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఐటమ్ గర్ల్‌గా మంచి పేరు తెచ్చుకున్న మిష్టీ ముఖర్జీ కన్నుమూశారు. ఆమె వయసు 27 సంవత్సరాలు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
కొంతకాలంగా ఆమెకు కిడ్నీ సంబంధిత అనారోగ్య స‌మ‌స్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బెంగళూరులోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, 2012లో లైఫ్‌ కి తో ల‌గ్ గ‌యి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అనంతరం అనేక ఐటెం సాంగ్స్‌లో నటించారు. ఆమె పలు బెంగాలీ సినిమాల్లోనూ నటించారు. 2014లో ఆమెపై సెక్స్ రాకెట్, పోర్నోగ్రఫీ కంటెంట్‌ వంటి ఆరోపణలు వచ్చాయి. 
 
దీంతో ఆమెతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తన తల్లిండ్రులు, సోదరుడి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె కిడ్నీ వ్యాధిబారిపడి ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం