Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#LegendSPB మాట తప్పారు, కంటతడి పెట్టిస్తున్న చివరి వీడియో-video

Advertiesment
#LegendSPB మాట తప్పారు, కంటతడి పెట్టిస్తున్న చివరి వీడియో-video
, శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (18:21 IST)
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మాట తప్పారు. ఆయన జీవితకాలంలో ఇలా మాట తప్పడం ఇదే తొలిసారి. చెప్పిన మాటకు.. ఇచ్చిన మాటకు కట్టుబడే మనిషిగా ఎస్పీబీకి సినీ ఇండస్ట్రీలో పేరుంది. అలాంటిది.. చివరిసారిగా ఆయన మాట తప్పారు. అందుకే... ఆయన చివరి వీడియో కంటతడి పెట్టిస్తోంది. 
 
కరోనా సోకి ఆస్పత్రిలో బాలు చేరారన్న వార్త బాహ్య ప్రపంచానికి తెలియగానే, ఆయన హితులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అలా ప్రతి ఒక్కరితో ఫోనులో మాట్లాడలేక పోయారు. దీంతో ఆయన అందరికీ కలిపి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
 
'నాకు వచ్చింది జ్వరమే.. ఇప్పుడది తగ్గుముఖం పడుతోంది... రెండ్రోజుల్లో డిశ్చార్జి అయి వచ్చేస్తాను' అంటూ కరోనాతో ఆసుపత్రిలో చేరిన సందర్భంగా అందరికీ వీడియో ద్వారా మాటిచ్చేశాడు. మాటిచ్చాడు కానీ నిలుపుకోలేకపోయాడు! 
 
సర్వశక్తులు ఒడ్డినా ఆ రాకాసి వైరస్‌తో పోరాడి అలసిపోయాడు. కరోనా నెగెటివ్ వచ్చినా ఊపిరితిత్తులు కొలిమితిత్తుల్లా మారిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ నుంచి మాత్రం కోలుకోలేకపోయాడు.
 
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఎస్పీ బాలు ఆగస్టు 5వ తేదీన స్వల్ప లక్షణాలతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆయనను పరామర్శించేందుకు విపరీతంగా ఫోన్లు చేయసాగారు. వారందరికీ సమాధానం చెప్పలేక బాలు ఓ వీడియో విడుదల చేశారు.
 
'జలుబు, జ్వరం తప్ప నేను భేషుగ్గానే ఉన్నాను. జ్వరం కాస్త నెమ్మదించింది. ఇంకెంత... రెండ్రోజులే. డిశ్చార్జి అవుతాను... ఇంట్లో ఉంటాను. నాకెంతో మంది ఫోన్లు చేస్తున్నారు. వారందరి కాల్స్ మాట్లాడలేకపోతున్నాను. నేను ఆసుపత్రిలో చేరడానికి వచ్చిన ముఖ్య కారణం విశ్రాంతి తీసుకోవడానికే. అందుకే ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను బాగానే ఉన్నాను, బాగానే ఉంటాను. ఎవరూ కంగారు పడవద్దు' అంటూ అందరినీ ఉద్దేశించి చివరి పలుకులు పలికారు. 
 
అభిమానులకు ఆయన అందించిన చివరి సందేశం బహుశా అదే అయ్యుంటుంది. కానీ వీడియోలో చెప్పినట్టుగా ఆయన రాలేకపోయాడు. అత్యంత విషాదాన్ని అందరిలో ఒలికిస్తూ, అనంతవాయువుల్లో లీనమయ్యాడు. వేల పాటలతో భారత సినీ సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన అంతటి మధుర గాయకుడు ఇచ్చిన మాట తప్పేశాడు!






 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌లో ఎన్నికల నగారా... శానిటైజర్లు, గొడుగులు, మాస్కులు సిద్ధం